వీఆర్‌వోను కొట్టిన టీడీపీ నేత

అధికారం పోయినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తగ్గడం లేదు. అధికారులపై దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఒక టీడీపీ నేత ఏకంగా వీఆర్‌వోను నడిరోడ్డుపైనే కొట్టాడు. గ్రామంలో తాము చెప్పినట్టు పనులు చేయాల్సిందేనంటూ టీడీపీ నేత బాలు నాయక్‌… వీఆర్‌వో వెంకటేశ్వర్లు పై దాడి చేశాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నా సరే మేం చెప్పినట్టు చేయాల్సిందే… వైసీపీ కార్యకర్తలు, నేతలే మూసుకుని ఉంటే మధ్యలో నీదేంది? అంటూ కాలితో తన్నాడు. […]

Advertisement
Update:2019-10-26 06:24 IST

అధికారం పోయినా టీడీపీ నేతలు, కార్యకర్తలు తగ్గడం లేదు. అధికారులపై దాడులు చేస్తూనే ఉన్నారు. ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం మల్లపాలెం గ్రామంలో ఒక టీడీపీ నేత ఏకంగా వీఆర్‌వోను నడిరోడ్డుపైనే కొట్టాడు.

గ్రామంలో తాము చెప్పినట్టు పనులు చేయాల్సిందేనంటూ టీడీపీ నేత బాలు నాయక్‌… వీఆర్‌వో వెంకటేశ్వర్లు పై దాడి చేశాడు. వైసీపీ ప్రభుత్వం ఉన్నా సరే మేం చెప్పినట్టు చేయాల్సిందే… వైసీపీ కార్యకర్తలు, నేతలే మూసుకుని ఉంటే మధ్యలో నీదేంది? అంటూ కాలితో తన్నాడు.

ఓటర్ల జాబితాకు ఆధార్‌ లింక్ చేసే పని మీద ఉన్న వీఆర్‌వోను అక్కడి నుంచి కొట్టి పంపించాడు. దాడి దృశ్యాలను కొందరు రికార్డు చేశారు. దాంతో వీఆర్‌వో ఫిర్యాదు మేరకు బాలు నాయక్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం బాలు నాయక్ టీడీపీ నేతల వద్ద తలదాచుకున్నట్లు చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News