కోడి కత్తి కేసు అన్నప్పుడే నీవు ఎవరి మనిషివో.... నీ సంస్కారం ఏంటో అర్థమైంది....

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వాడుతున్న భాషపై మంత్రి పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. పవన్‌ కల్యాణ్ ఏమాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ జగన్‌నే విమర్శించి… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌నే విమర్శించడం పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే చెల్లిందన్నారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ ఎవరి మనిషో స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఒక ప్రతిపక్షనాయకుడిని చంపేందుకు దాడి జరిగితే దాన్ని కోడి కత్తి కేసు అంటూ చంద్రబాబు […]

Advertisement
Update:2019-10-26 01:33 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ వాడుతున్న భాషపై మంత్రి పేర్ని నాని అభ్యంతరం తెలిపారు. పవన్‌ కల్యాణ్ ఏమాత్రం సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. వైసీపీ విపక్షంలో ఉన్నప్పుడూ జగన్‌నే విమర్శించి… ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా జగన్‌నే విమర్శించడం పవన్‌ కల్యాణ్‌కు మాత్రమే చెల్లిందన్నారు. దీన్ని బట్టి పవన్ కల్యాణ్ ఎవరి మనిషో స్పష్టంగా తెలుస్తోందన్నారు.

ఒక ప్రతిపక్షనాయకుడిని చంపేందుకు దాడి జరిగితే దాన్ని కోడి కత్తి కేసు అంటూ చంద్రబాబు తరహాలోనే పవన్‌ కల్యాణ్ కూడా హేళన చేస్తున్నారని… దీన్ని బట్టే పవన్‌ కల్యాణ్ సంస్కారం ఏంటో అర్థమవుతోందన్నారు. చంద్రబాబు చేతిలో పవన్‌ కల్యాణ్ ఒక్క బొమ్మ అని అభివర్ణించారు. మాస్టర్ చంద్రబాబు చెప్పినట్టే పవన్‌ కల్యాణ్ బొమ్మ మాట్లాడుతుందన్నారు.

జగన్‌పై కేసులు ఉండడం వల్లే ఎవరినీ ప్రశ్నించలేకపోతున్నారంటున్న పవన్‌ కల్యాణ్… మరి చంద్రబాబు ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు ప్రశ్నించలేకపోయారో చెప్పాలని పేర్నినాని డిమాండ్ చేశారు.

చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉద్దానం పేరుతో పవన్‌ కల్యాణ్ డ్రామాలు చేసినా నాటి ప్రభుత్వం ఆ సమస్యను పట్టించుకోలేదన్నారు. కానీ జగన్ సీఎం అవగానే అక్కడ కిడ్నీ ఆస్పత్రిని ఏర్పాటు చేశారని… ఈ విషయంపై మాత్రం పవన్‌ కల్యాణ్ ఎందుకు మాట్లాడడం లేదని నిలదీశారు. పవన్‌ కల్యాణ్ ఇప్పటికైనా లాలూచీ రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు.

2014 ఎన్నికల్లో మోడీ కాళ్లు పట్టుకుని గెలిచిన చంద్రబాబు… 2019లో ఒంటరిగా వెళ్లి అభాసుపాలయ్యారు. అందుకే తిరిగి మోడీ భజన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తన సొంత మనిషి సుజనాచౌదరిని బీజేపీలోకి పంపించి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.

బంగారు బాతు లాంటి అమరావతిని నిర్మించానంటూ చంద్రబాబు పచ్చి అబద్దాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. హైకోర్టు మాత్రం అసలు రాజధాని ఎక్కడ అని ప్రశ్నిస్తోందని పేర్ని నాని వ్యాఖ్యానించారు.

Tags:    
Advertisement

Similar News