చంద్రబాబు దీక్షకు ఏ చట్టం కింద 10 కోట్లు...? " హైకోర్టు ఆగ్రహం

ఎన్నికలు సమీపించిన సమయంలో కేంద్రంపై పోరాటం అంటూ ఫిబ్రవరి 11న చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ వన్‌డే దీక్షకు 10 కోట్లు ఖర్చు చేశారు. చివరకు టీటీడీకి చెందిన నాలుగు కోట్లను కూడా టీడీపీ నేతల విందులకు, హోటళ్లకు వాడేశారు. ఇలా ప్రజల ధనాన్ని చంద్రబాబు సొంత దీక్షకు వాడుకోవడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… ఒక రోజు దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారా? అంటూ నోరెళ్లబెట్టింది. ఏ చట్టం కింద […]

Advertisement
Update:2019-10-25 01:46 IST

ఎన్నికలు సమీపించిన సమయంలో కేంద్రంపై పోరాటం అంటూ ఫిబ్రవరి 11న చంద్రబాబునాయుడు ఢిల్లీలో ధర్మపోరాట దీక్ష చేశారు. ఈ వన్‌డే దీక్షకు 10 కోట్లు ఖర్చు చేశారు. చివరకు టీటీడీకి చెందిన నాలుగు కోట్లను కూడా టీడీపీ నేతల విందులకు, హోటళ్లకు వాడేశారు.

ఇలా ప్రజల ధనాన్ని చంద్రబాబు సొంత దీక్షకు వాడుకోవడంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు… ఒక రోజు దీక్షకు రూ. 10 కోట్లు ఖర్చు పెట్టారా? అంటూ నోరెళ్లబెట్టింది. ఏ చట్టం కింద రూ. 10 కోట్లను కేటాయించారో చెప్పాలని ఆదేశించింది. అసలు ఈ డబ్బును చంద్రబాబు దీక్షకు మళ్లించిన అధికారులు ఎవరో కూడా తెలపాలని ఆదేశించింది.

ప్రజాధనాన్ని వృథా చేసే అధికారం అధికారులకు, రాజకీయ నాయకులకు ఎవరిచ్చారని ప్రశ్నించింది. ఖర్చు పెట్టిన డబ్బంతా ప్రజలు పన్నుల రూపంలో చెల్లించినదని దాన్ని ఇలా రాజకీయ కార్యక్రమాలకు వాడే అధికారం ఎవరికీ లేదని జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ధర్నాకు 10 కోట్లు ఖర్చు చేయడాన్ని చాలా తీవ్రంగా భావిస్తున్నామని… దీనిపై పూర్తి వివరాలను కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను నవంబర్‌ 21కి వాయిదా వేసింది హైకోర్టు.

Tags:    
Advertisement

Similar News