హుజూర్‌నగర్ ఓట్ల లెక్కింపు జరిగేది ఇలా..!

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీకి ఈ నెల 21న ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దీని ఫలితం గురువారం నాడు వెలువడనుంది. నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 302 పోలింగ్ కేంద్రాల్లో 84.75 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సూర్యాపేట‌కు తరలించారు. సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు లెక్కిస్తారు.. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. […]

Advertisement
Update:2019-10-23 10:49 IST

సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ అసెంబ్లీకి ఈ నెల 21న ఉపఎన్నిక జరిగిన విషయం తెలిసిందే. దీని ఫలితం గురువారం నాడు వెలువడనుంది. నియోజకవర్గంలోని 7 మండలాలకు చెందిన 302 పోలింగ్ కేంద్రాల్లో 84.75 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను సూర్యాపేట‌కు తరలించారు.

సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. రేపు ఉదయం 8 గంటలకు ముందుగా పోస్టల్ బ్యాలెట్ లు లెక్కిస్తారు.. అనంతరం ఈవీఎంలలోని ఓట్లను లెక్కిస్తారు. మొత్తం 22 రౌండ్ల పాటు లెక్కింపు జరగనుండగా.. దీని కోసం 14 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ప్రతీ 10 నిమిషాలకు ఒక్కో రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది.

ఇక 10 గంటల వరకు ట్రెండింగ్స్ తెలుస్తాయని.. 2 గంటల కల్లా ఫలితం వెలువడుతుందని అధికారులు తెలిపారు. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్ తరపున సైదిరెడ్డి, కాంగ్రెస్ తరపున పద్మావతీ రెడ్డి, బీజేపీ తరపున కోట రామారావు పోటీ చేశారు.

Tags:    
Advertisement

Similar News