టాలీవుడ్ కథలు... బాలీవుడ్ హిట్స్... స్టార్లకు కలిసొచ్చింది...

దేశంలో సినిమాలంటే హిందీ సినిమాలే అన్నట్టుగా ఒకప్పుడు ఉండేవి.. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అంతా హిందీ సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి.. కానీ నేడు బాలీవుడ్ కు కథల కొరత దాపురించింది. తెలుగు సినిమాలను వరుసగా రిమేక్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో ఉంది. 1997లో హలో బ్రదర్ అంటూ నాగార్జున తెలుగులో […]

Advertisement
Update:2019-10-14 10:30 IST

దేశంలో సినిమాలంటే హిందీ సినిమాలే అన్నట్టుగా ఒకప్పుడు ఉండేవి.. ఇండియాలో బిగ్గెస్ట్ మార్కెట్ అంతా హిందీ సినిమానే అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా ఉర్రూతలూగించి.. కలెక్షన్ల వర్షం కురిపించిన సినిమాలు ఎన్నో రిలీజ్ అయ్యాయి..

కానీ నేడు బాలీవుడ్ కు కథల కొరత దాపురించింది. తెలుగు సినిమాలను వరుసగా రిమేక్ చేస్తూ సక్సెస్ లు అందుకుంటున్నారు. ఈ సంస్కృతి ఇప్పుడే కాదు.. ఎప్పటి నుంచో ఉంది.

1997లో హలో బ్రదర్ అంటూ నాగార్జున తెలుగులో తీసిన బ్లాక్ బస్టర్ మూవీని ఇటీవలే హిందీలో వరుణ్ ధావన్ ‘జాడ్వా2’ అని తీయగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. 200 కోట్లు వసూలు చేసింది.

ఇక తెలుగులో సూపర్ డూపర్ హిట్ అయిన పోకిరిని హిందీలో సల్మాన్ ఖాన్ ‘వాంటెడ్’ పేరుతో తీసి కలెక్షన్ల వర్షం కురిపించారు. ఈ సినిమా 233 కోట్లు వసూలు చేసింది.

ఇక ఇదే సల్మాన్ తెలుగులో హిట్ అయిన రవితేజ ‘కిక్’ మూవీని హిందీలో తీసి బ్లాక్ బ్లస్టర్ కొట్టాడు.. ఈ సినిమా 400 కోట్ల కలెక్షన్లు సాధించింది.

ఇక తెలుగు రెడీని కూడా సల్మాన్ రెడీ పేరుతో కాపీ కొట్టాడు. విక్రమార్కుడు సినిమాను రౌడీ రాథోడ్ గా అక్షయ్ కుమార్ తీసి సంచలన విజయం అందుకున్నాడు. తెలుగు ఖుషీని హిందీలో తీశారు. తెలుగులో చిరంజీవి నటించిన ‘బావగారు బాగున్నారా’ మూవీని హిందీలో గోవిందా ఖున్వారా తీసి ఇండస్ట్రీ హిట్ ఇచ్చాడు.

తెలుగు శుభలగ్నం మూవీని హిందీలో జుడాయిగా తీసి అనిల్ కపూర్ శ్రీదేవి బాక్స్ ఆఫీస్ హిట్ ఇచ్చారు.

ఇక అలాగే తొలిప్రేమను ముజేఖుచ్ కేహానా హై.. అతడు మూవీని ఏక్ థా పవర్ ఆఫ్ వన్ అని… మర్యాద రామన్నను సన్ ఆఫ్ సర్ధార్ గా తీసి బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు.

ఇలా తెలుగు సినిమా కంటెంట్ హిందీ జనాలకు దిక్కైంది. మన సినిమాలు కాపీ కొట్టి కోట్లు కొల్లగొట్టారు.

Tags:    
Advertisement

Similar News