ఆళ్లగడ్డలో అఖిల ప్రియ భర్త భార్గవ్‌ నాయుడు దందాలు... హత్యాయత్నం కేసు నమోదు

ప్రభుత్వం మారినా ఆళ్లగడ్డలో భూమా వర్గం దూకుడు తగ్గడం లేదు. భార్య బ్యాగ్రౌండ్‌ను అడ్డుపెట్టుకుని అఖిలప్రియ భర్త భార్గవ్‌ రాం నాయుడు కూడా దందాలు, బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయింది. ఆళ్లగడ్డ రూరల్‌ మండలంలోని కోట కందుకూరు మెట్టవద్ద శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ క్రషర్ పరిశ్రమ ఉంది. ఇందులో దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన శివరామిరెడ్డికి 60 శాతం వాటా ఉండగా… అఖిలప్రియ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. శివరామిరెడ్డికి […]

Advertisement
Update:2019-10-03 02:34 IST

ప్రభుత్వం మారినా ఆళ్లగడ్డలో భూమా వర్గం దూకుడు తగ్గడం లేదు. భార్య బ్యాగ్రౌండ్‌ను అడ్డుపెట్టుకుని అఖిలప్రియ భర్త భార్గవ్‌ రాం నాయుడు కూడా దందాలు, బెదిరింపులకు దిగాడు. ఈ నేపథ్యంలోనే ఆయనపై హత్యాయత్నం కేసు నమోదు అయింది.

ఆళ్లగడ్డ రూరల్‌ మండలంలోని కోట కందుకూరు మెట్టవద్ద శ్రీలక్ష్మీ ఇండస్ట్రీస్ క్రషర్ పరిశ్రమ ఉంది. ఇందులో దొర్నిపాడు మండలం కొండాపురం గ్రామానికి చెందిన శివరామిరెడ్డికి 60 శాతం వాటా ఉండగా… అఖిలప్రియ కుటుంబానికి 40 శాతం వాటా ఉంది. శివరామిరెడ్డికి సొంతంగా మరో క్రషర్ పరిశ్రమ ఉంది. ఈ రెండు పరిశ్రమలను పూర్తిగా తమకు అప్పగించి వెళ్లిపోవాలంటూ అనుచరులతో వెళ్లి శివరామిరెడ్డిని భార్గవ్ రాం నాయుడు బెదిరించాడు.

శివరామిరెడ్డి అంగీకరించకపోవడంతో అనుచరులతో కలిసి చిత్రహింసలు పెట్టాడు. దాంతో బాధితుడు శివరామిరెడ్డి భార్య మాధవీలత పోలీసులను ఆశ్రయించారు. తన భర్తను హత్య చేసేందుకు భార్గవరాం నాయుడు ప్రయత్నించాడని, రక్షణ కల్పించాలని కోరారు. దీనిపై ప్రాథమిక విచారణ చేసిన పోలీసులు దాడి నిజమేనని నిర్ధారించుకుని భార్గవ్‌రాం నాయుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు.

అతడి అనుచరులు మరో పదిమందిపైనా కేసులు నమోదు చేశారు. ఇప్పటికే ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆళ్లగడ్డ ప్రాంతంలో అఖిలప్రియ తరపున ఆమె భర్త భార్గవ రాం నాయుడు దందాలకు దిగడం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది.

అఖిలప్రియను ముందు పెట్టి వ్యవహారాలను నడుపుతూ నియోజక వర్గంలో హవా చెలాయించేందుకు భార్గవ రాం నాయుడు ప్రయత్నిస్తున్నారన్న అభిప్రాయాన్ని భూమా అనుచరులు వ్యక్తం చేస్తున్నారు.

అఖిలప్రియ, భార్గవ్‌ రాం నాయుడు తొలి వివాహ భాగస్వామ్యుల నుంచి విడాకులు తీసుకున్నారు. అఖిలప్రియ మంత్రిగా ఉన్న సమయంలో ఇద్దరూ ప్రేమించుకుని ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్గవ్‌ రాం నాయుడు తొలుత ఒక మాజీ డీజీపీ కుమార్తెను వివాహం చేసుకుని ఆమెకు విడాకులు ఇచ్చారు.

Tags:    
Advertisement

Similar News