సూర్య కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్

తెలుగు మార్కెట్ పై పూర్తిగా పట్టుకోల్పోయాడు సూర్య. రీసెంట్ గా వచ్చిన బందోబస్త్ వసూళ్లు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అంతకంటే ముందొచ్చిన ఎన్జీకేతోనే సూర్య మార్కెట్ పోయిందని అంతా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు బందోబస్త్ రాకతో సూర్య పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది. వారం రోజుల కిందట విడుదలైన ఈ సినిమాకు మొదటి వారంలో కేవలం కోటి 75 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కనీసం 2 కోట్లు కూడా దాటలేదంటే […]

Advertisement
Update:2019-10-01 07:36 IST

తెలుగు మార్కెట్ పై పూర్తిగా పట్టుకోల్పోయాడు సూర్య. రీసెంట్ గా వచ్చిన బందోబస్త్ వసూళ్లు చూస్తే ఈ విషయం క్లియర్ గా అర్థమైపోతుంది. అంతకంటే ముందొచ్చిన ఎన్జీకేతోనే సూర్య మార్కెట్ పోయిందని అంతా డిసైడ్ అయ్యారు. ఇప్పుడు బందోబస్త్ రాకతో సూర్య పరిస్థితి మరింత ఘోరంగా తయారైంది.

వారం రోజుల కిందట విడుదలైన ఈ సినిమాకు మొదటి వారంలో కేవలం కోటి 75 లక్షల రూపాయల షేర్ మాత్రమే వచ్చింది. కనీసం 2 కోట్లు కూడా దాటలేదంటే సూర్య పరిస్థితి తెలుగులో ఎంత దయనీయంగా తయారైందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వసూళ్ల పరంగా చూసుకుంటే డిజాస్టర్ అనే పదం కూడా చాలా చిన్నదే.

గతంలో నాగార్జున నటించిన ఆఫీసర్ సినిమా డబుల్ డిజాస్టర్ గా పేరుతెచ్చుకుంది. ఆ తర్వాత బాలయ్య నటించిన కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు రెవెన్యూ పరంగా డిజాస్టర్లు అనిపించుకున్నాయి. ఇప్పుడు వాటి కంటే తక్కువ షేర్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ల లిస్ట్ లో నంబర్ వన్ స్థానంలో నిలిచాడు సూర్య. బందోబస్ట్ వసూళ్లతో పోల్చిచూస్తే.. ఎన్జీకే కు మంచి కలెక్షన్లు వచ్చినట్టయింది.

ఎలాంటి కథలు సెలక్ట్ చేసుకోవాలో అర్థంకాక కన్ఫ్యూజ్ అవుతున్నాడు సూర్య. తెలుగు, తమిళ మార్కెట్లను దృష్టిలో పెట్టుకోవడంతోనే ఈ సమస్య వస్తోంది. తమిళ్ కు సెట్ అయ్యే కథలు తెలుగుకు సూట్ అవ్వడం లేదు. గజనీ లాంటి కథలు అప్పుడప్పుడు మాత్రమే దొరుకుతాయి. అందుకే అటు కంటెంట్, ఇటు కమర్షియల్ అంశాల్ని బ్యాలెన్స్ చేయలేక బోల్తా పడుతున్నాడు సూర్య.

Tags:    
Advertisement

Similar News