పోలీసుల అదుపులో చలపతి భార్య అరుణ
మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ మిలటరీ కమిషన్ చీఫ్ చలపతి భార్య పోలీసులకు పట్టుబడ్డారని సమాచారం. ఇటీవల గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతి భార్య అరుణ గాయాలతో పోలీసులకు పట్టుబడినట్టు చెబుతున్నారు. ఆమెతో పాటు మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ సభ్యుడు జగన్ భార్య భవాని కూడా పోలీసులకు పట్టుబడ్డారు. భవాని అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో భవానీ గాయాలతో పట్టుబడినట్టు డీజీపీ వెల్లడించారు. భవానీకి […]
మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత, ఏవోబీ మిలటరీ కమిషన్ చీఫ్ చలపతి భార్య పోలీసులకు పట్టుబడ్డారని సమాచారం. ఇటీవల గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో చలపతి భార్య అరుణ గాయాలతో పోలీసులకు పట్టుబడినట్టు చెబుతున్నారు. ఆమెతో పాటు మావోయిస్టు స్టేట్ జోన్ కమిటీ సభ్యుడు జగన్ భార్య భవాని కూడా పోలీసులకు పట్టుబడ్డారు.
భవాని అరెస్ట్‌ను పోలీసులు ధృవీకరిస్తున్నారు. ఎన్‌కౌంటర్ సమయంలో భవానీ గాయాలతో పట్టుబడినట్టు డీజీపీ వెల్లడించారు. భవానీకి ఆస్పత్రిలో చికిత్స అందించినట్టు చెప్పారు. కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందని డీజీపీ గౌతమ్ సవాంగ్ వివరించారు.
మరోవైపు గాయాలతో పట్టుబడిన అరుణకు ఆస్పత్రిలో చికిత్స అందించగా ఆమె కోలుకున్నట్టు తెలుస్తోంది. అనంతరం విచారణ కోసం అరుణను ఇంటెలిజెన్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం.
చలపతి భార్య అరుణ చిన్న వయస్సులోనే మావోయిస్టుల్లో చేరారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హత్యల్లో అరుణ కీలక పాత్ర పోషించారు. అరుణ తండ్రి విజయవాడకు చెందిన వారు. విశాఖలో వారి కుటుంబం స్థిరపడింది. అరుణ సోదరుడు కూడా మావోయిస్టుల్లో చేరారు. కానీ ఎన్‌కౌంటర్‌లో ఇది వరకే అతడు చనిపోయాడు.