ప్రపంచ కుస్తీ ర్యాంకింగ్స్ లో భారత వస్తాదుల జోరు

దీపక్ పూనియా ఇక ప్రపంచ నంబర్ వన్ టాప్ ర్యాంక్ కోల్పోయిన భజరంగ్ పూనియా భారత యువ వస్తాదు , ప్రపంచ జూనియర్ చాంపియన్ ..20 ఏళ్ల దీపక్ పూనియా పురుషుల 86 కిలోల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు. కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా ఇటీవలే ముగిసిన 2019 ప్రపంచ సీనియర్ కుస్తీ టోర్నీలో తొలిసారిగా పాల్గొనటమే కాదు.. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించడంతో పాటు…రజత పతకం సాధించడం ద్వారా తనకు తానే […]

Advertisement
Update:2019-09-28 06:13 IST
  • దీపక్ పూనియా ఇక ప్రపంచ నంబర్ వన్
  • టాప్ ర్యాంక్ కోల్పోయిన భజరంగ్ పూనియా

భారత యువ వస్తాదు , ప్రపంచ జూనియర్ చాంపియన్ ..20 ఏళ్ల దీపక్ పూనియా పురుషుల 86 కిలోల విభాగంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సాధించాడు.

కజకిస్థాన్ లోని నూర్ సుల్తాన్ వేదికగా ఇటీవలే ముగిసిన 2019 ప్రపంచ సీనియర్ కుస్తీ టోర్నీలో తొలిసారిగా పాల్గొనటమే కాదు.. టోక్యో ఒలింపిక్స్ కు అర్హత సంపాదించడంతో పాటు…రజత పతకం సాధించడం ద్వారా తనకు తానే సాటిగా నిలిచాడు.

ఇరాన్ వస్తాదు హసన్ యజ్డానీతో జరగాల్సిన గోల్డ్ మెడల్ మ్యాచ్ నుంచి…కాలిమడమ గాయంతో దీపక్ పూనియా ఉపసంహరించుకోడం ద్వారా.. రజత పతకంతోనే సరిపెట్టుకొన్నాడు.

ప్రపంచ జూనియర్ కుస్తీలో బంగారు పతకం, పలు సీనియర్ టోర్నీలలో రజత, కాంస్య పతకాలు సాధించడం ద్వారా దీపక్ పూనియా మొత్తం 82 పాయింట్లతో.. ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ సొంతం చేసుకొన్నాడు.

మరోవైపు… ప్రపంచ, ఒలింపిక్ చాంపియన్ హసన్ యజ్డానీ మాత్రం రెండోర్యాంక్ కు పడిపోయాడు.

భజరంగ్ చేజారిన టాప్ ర్యాంక్…

మరోవైపు…పురుషుల 65 కిలోల విభాగంలో ఇప్పటి వరకూ ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్న భజరంగ్ పూనియా… ఇటీవలే ముగిసిన ప్రపంచ కుస్తీలో కాంస్య పతకం మాత్రమే సాధించడం ద్వారా తన టాప్ ర్యాంక్ ను కోల్పోయాడు. 25 సంవత్సరాల భజరంగ్ పూనియా 63 పాయింట్లతో రెండోర్యాంక్ లో నిలిచాడు.

రష్యా వస్తాదు, ప్రపంచ చాంపియన్ రషీదోవ్ 65 కిలోల విభాగంలో సరికొత్త ప్రపంచ నంబర్ వన్ ర్యాంకర్ గా అవతరించాడు.
57 కిలోల విభాగంలో రవి దహియా 5వ ర్యాంక్ లోనూ, రాహుల్ అవారే రెండో ర్యాంక్ లోనూ, మహిళల 53 కిలోల విభాగంలో వినేశ్ పోగట్ రెండో ర్యాంక్ లోనూ నిలిచారు.

మొత్తం మీద 2019 ప్రపంచ కుస్తీ పోటీలు భారత వస్తాదుల ర్యాంకులను గణనీయంగా మెరుగుపరచాయి. మొత్తం ఐదుగురు మల్లయోధులు పతకాలు సాధించగా.. వీరిలో నలుగురు ఒలింపిక్స్ బెర్త్ లు ఖాయం చేసుకోడం విశేషం.

Tags:    
Advertisement

Similar News