భారత్-సౌతాఫ్రికా మహిళల రెండో టీ-20 వర్షార్పణం

ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో పైచేయి టీ-20 మహిళా ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య సూరత్ వేదికగా జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని రెండో మ్యాచ్ కు వానదెబ్బ తగిలింది. సూరత్ లోని లాల్ బాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ భారీవర్షం కారణంగా రద్దుల పద్దులో చేరిపోయింది. మ్యాచ్ కు ముందు, మ్యాచ్ ప్రారంభం కావాల్సిన […]

Advertisement
Update:2019-09-27 01:30 IST
  • ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దు
  • 5 మ్యాచ్ ల సిరీస్ లో భారత్ 1-0తో పైచేయి

టీ-20 మహిళా ప్రపంచకప్ కు సన్నాహకంగా భారత్- సౌతాఫ్రికా జట్ల మధ్య సూరత్ వేదికగా జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ లోని రెండో మ్యాచ్ కు వానదెబ్బ తగిలింది.

సూరత్ లోని లాల్ బాయి కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ భారీవర్షం కారణంగా రద్దుల పద్దులో చేరిపోయింది.

మ్యాచ్ కు ముందు, మ్యాచ్ ప్రారంభం కావాల్సిన సమయంలోనూ ఆగకుండా వానపడుతూనే ఉండడంతో…మ్యాచ్ ను రద్దు చేయక తప్పలేదని మ్యాచ్ రిఫరీ లక్ష్మి ప్రకటించారు.

సూరత్ వేదికగానే ముగిసిన తొలి టీ-20లో ఆతిథ్య భారత్ 11 పరుగుల తేడాతో నెగ్గడం ద్వారా 1-0 ఆధిక్యత సంపాదించింది.

సిరీస్ లోని మూడో టీ-20 మ్యాచ్…సూరత్ వేదికగానే ఆదివారం జరుగనుంది.

భారత జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్, సఫారీ జట్టుకు లుస్ నాయకత్వం వహిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News