పద్మాదేవేందర్ రెడ్డికి చేదు అనుభవం
పద్మా దేవేందర్ రెడ్డి. మాజీ డిప్యూటీ స్పీకర్. ప్రస్తుతం మెదక్ జిల్లా ఎమ్మెల్యే. అలాంటి టీఆర్ఎస్ మహిళా నేతకు ఘోర అవమానం ఎదురైంది. అది సీఎం కేసీఆర్ ఇంటి వద్ద. మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ కోటరీ ఆమెను ప్రగతి భవన్ లోకి అనుమతించక, తిప్పి పంపించివేయడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సన్మాన సభను కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రులు, ఐఏఎస్ […]
పద్మా దేవేందర్ రెడ్డి. మాజీ డిప్యూటీ స్పీకర్. ప్రస్తుతం మెదక్ జిల్లా ఎమ్మెల్యే. అలాంటి టీఆర్ఎస్ మహిళా నేతకు ఘోర అవమానం ఎదురైంది. అది సీఎం కేసీఆర్ ఇంటి వద్ద. మహిళ అని కూడా చూడకుండా కేసీఆర్ కోటరీ ఆమెను ప్రగతి భవన్ లోకి అనుమతించక, తిప్పి పంపించివేయడం హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా గవర్నర్ నరసింహన్ వీడ్కోలు సన్మాన సభను కేసీఆర్ ప్రగతి భవన్ లో ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రులు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లకు అనుమతిచ్చారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతి ఇవ్వలేదు.
అయితే ఈ వేడుకకు హాజరయ్యేందుకు వచ్చిన ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. దీంతో షాక్ కు గురైన పద్మ చాలా సేపు అక్కడే వేచి చూసినా ప్రగతి భవన్ లోకి పంపించలేదు. దీంతో ఆమె నిరాశగా వెళ్లిపోయారు.
మంత్రులకు మాత్రమే అనుమతి ఉందని.. ఎమ్మెల్యేలకు లేదని ప్రగతి భవన్ సిబ్బంది చెబుతున్నారు. పద్మా దేవేందర్ రెడ్డికి ఉన్న హోదా దృష్ట్యా ఆమెను అనుమతిస్తే బాగుండేదని టీఆర్ఎస్ వాదులు చెబుతున్నారు.
కాగా పద్మను అనుమతించని పోలీసులు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ కుమారుడిని మాత్రం ప్రగతి భవన్ లోకి అనుమతించడం దుమారం రేపింది. ఇది పక్షపాతమే అని పద్మ అనుకూల వాదులు మండిపడుతున్నారు.