సైరా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అక్కడే

సైరాకు సంబంధించి అన్నీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన యూనిట్, ప్రస్తుతం ప్రమోషన్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను భారీ ఎత్తున చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అనగానే హైదరాబాద్ లేదా విశాఖ.. ఈ రెండు ప్రాంతాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆశ్చర్యకరంగా సైరా యూనిట్ మాత్రం తమ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కర్నూల్ ను వేదికగా ఎంచుకుంది. […]

Advertisement
Update:2019-09-05 15:55 IST

సైరాకు సంబంధించి అన్నీ ఒక్కొక్కటిగా కొలిక్కి వస్తున్నాయి. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్ని ఫినిషింగ్ స్టేజ్ కు తీసుకొచ్చిన యూనిట్, ప్రస్తుతం ప్రమోషన్ పై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను భారీ ఎత్తున చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ అనగానే హైదరాబాద్ లేదా విశాఖ.. ఈ రెండు ప్రాంతాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ ఆశ్చర్యకరంగా సైరా యూనిట్ మాత్రం తమ సినిమా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు కర్నూల్ ను వేదికగా ఎంచుకుంది. దీనికి ఓ కారణం ఉంది.

మొట్టమొదటి స్వాతంత్ర్య సమరయోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా వస్తోంది సైరా. ఇతడిది ఆంధ్రప్రదేశ్ లోని రేనాడు ప్రాంతం. ప్రస్తుతం ఈ ప్రాంతం కర్నూల్ జిల్లాలో ఉంది. అందుకే వ్యూహాత్మకంగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కోసం కర్నూల్ ను వేదికగా ఎంచుకున్నారు మేకర్స్. హైదరాబాద్, విశాఖ కంటే కర్నూలులో వేడుక జరపడమే సందర్భోచితంగా ఉంటుందని స్వయంగా చిరంజీవి సూచించాడు.

ఇక ప్రత్యేక అతిథుల విషయానికొస్తే.. పవన్ కల్యాణ్, రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ లాంటి ప్రముఖులు ఈ వేడుకకు హాజరుకాబోతున్నారు. వీళ్ల డేట్స్ ను కూడా పరిగణనలోకి తీసుకొని ప్రీ-రిలీజ్ డేట్ ను సెట్ చేస్తారు. అక్టోబర్ 2న సైరా సినిమా వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.

Tags:    
Advertisement

Similar News