విడాకులు తీసుకున్న ప్రముఖ హీరోయిన్

ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఇలియానా డిక్రూజ్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయింది. అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఇలియానా తన పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం చాలా సీక్రెసీ మైంటైన్ చేసేది. ఒకరోజు సోషల్ మీడియాలో ‘హబ్బీ’ అంటూ ఫొటోస్ షేర్ చేసే దాకా ఆమెకి పెళ్లి అయింది అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి […]

Advertisement
Update:2019-08-27 09:55 IST

ఒకప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఇలియానా డిక్రూజ్ కెరీర్ పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు బాలీవుడ్ షిఫ్ట్ అయింది. అక్కడ కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్న ఇలియానా తన పర్సనల్ లైఫ్ విషయంలో మాత్రం చాలా సీక్రెసీ మైంటైన్ చేసేది.

ఒకరోజు సోషల్ మీడియాలో ‘హబ్బీ’ అంటూ ఫొటోస్ షేర్ చేసే దాకా ఆమెకి పెళ్లి అయింది అన్న విషయం కూడా చాలా తక్కువ మందికి తెలుసు. గత కొన్నేళ్లుగా ఈమె ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో ఉన్నప్పటికీ ఎన్నడు ఆ విషయాన్ని స్వయంగా బయటపెట్టలేదు.

అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో ఈమెను చూసి అందరూ ప్రెగ్నెంట్ ఏమో అనుకున్నారు. ఈ పోస్ట్ చూస్తే ఈమె విడాకులు తీసుకున్నట్లు అనిపిస్తోంది. “మిమ్మల్ని హర్ట్ చేసిన వాళ్లకి దూరమయ్యే బలం మీకుందో లేదో అని మిమ్మల్ని మీరు అడగండి. ఏ ఆలోచనలు లేదా ఎమోషన్స్ మిమ్మల్ని క్లియర్ గా ఉండనివ్వటంలేదో వాటిని తీసేయండి” అంటూ పోస్ట్ చేసిన ఇలియానా తన భర్తతో ఉన్న ప్రతి ఫోటోని తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి డిలీట్ చేసింది.

ఆండ్రూ కూడా ఇలియానా ఫోటోలు డిలీట్ చేసేసాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇంస్టాగ్రామ్ లో ఫాలో కూడా అవ్వడం లేదు. దీంతో వీరిద్దరూ బ్రేకప్ అయ్యారని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. అసలు ఆమె పెళ్లి విషయమే బయటపెట్టని ఇలియానా బ్రేకప్ విషయం బయటపెడుతుందా?

Tags:    
Advertisement

Similar News