మొన్న కారవాన్.... ఇప్పుడు 'బీస్ట్'....

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదలచేయబోతున్నారట. ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతుంది. అయితే ఈ సినిమా లో వివిధ సినిమా పరిశ్రమ ల కి సంబంధించిన ప్రముఖ నటులు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు. ఇది పక్కన పెడితే… అల్లు అర్జున్ ఆ మధ్య ఒక పెద్ద కారవాన్ కొనుక్కున్న సంగతి సోషల్ మీడియా లో తెలిపాడు. ఆ కారవాన్… ఎంత పెద్ద […]

Advertisement
Update:2019-08-25 06:52 IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్… ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురంలో’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాని సంక్రాంతికి విడుదలచేయబోతున్నారట.

ఈ సినిమా షూటింగ్ శరవేగం గా జరుగుతుంది. అయితే ఈ సినిమా లో వివిధ సినిమా పరిశ్రమ ల కి సంబంధించిన ప్రముఖ నటులు ముఖ్య పత్రాలు పోషిస్తున్నారు.

ఇది పక్కన పెడితే… అల్లు అర్జున్ ఆ మధ్య ఒక పెద్ద కారవాన్ కొనుక్కున్న సంగతి సోషల్ మీడియా లో తెలిపాడు. ఆ కారవాన్… ఎంత పెద్ద వాహనం అంటే, చాలా అత్యాధునికంగా, అన్ని సదుపాయాలతో చాలా స్టైలిష్ డిజైన్ తో… స్వయంగా చేయించుకున్నాడు బన్నీ. దానికి ఒక పేరు కూడా పెట్టుకున్నాడు.

ఇకపోతే ఇప్పుడు తాజాగా అల్లు అర్జున్ రేంజ్ రోవర్ కార్ ని కొనుగోలు చేసాడు. ఎప్పటి నుంచో కొత్త కార్ కొనుక్కోవాలని బన్నీ అనుకున్నాడట… కానీ ఇప్పుడు కుదిరిందట. అయితే ఈ కార్ కి కూడా ‘బీస్ట్’ అనే పేరు పెట్టుకున్నాడు.

Tags:    
Advertisement

Similar News