గొర్రెలు కాచుకునే అనిల్ యాదవ్ గాడిని మంత్రిని చేస్తే ఇంతే " టీడీపీ ఆర్టిస్టుల ప్రచారం
పదేళ్ల తర్వాత ఏపీలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ఇల్లు కూడా మునిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదంటూ టీడీపీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో పదేపదే టీడీపీ బొక్కబోర్లా పడుతూనే ఉంది. తాజాగా వరదల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే క్రమంలో టీడీపీ కుట్ర బయటపడిపోయింది. ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్నికల యాడ్స్‌లో నటించిన పెయిడ్ […]
పదేళ్ల తర్వాత ఏపీలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. దీంతో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చంద్రబాబు ఇల్లు కూడా మునిగింది.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి సాయం చేయడం లేదంటూ టీడీపీ సోషల్ మీడియాలో క్యాంపెయిన్ మొదలుపెట్టింది. ఆ ప్రయత్నంలో పదేపదే టీడీపీ బొక్కబోర్లా పడుతూనే ఉంది.
తాజాగా వరదల విషయంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం చేసే క్రమంలో టీడీపీ కుట్ర బయటపడిపోయింది. ఎన్నికలకు ముందు టీడీపీ ఎన్నికల యాడ్స్‌లో నటించిన పెయిడ్ ఆర్టిస్టులతోనే రైతుల వేషాలు కట్టించి ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తున్నారంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీడీపీ ఎన్నికల ప్రకటనల్లో నటించిన వారే ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ టీవీ గొట్టాల మందు అదే పని చేస్తున్నారు. ఈ విషయాన్ని పలువురు గమనించారు. దాంతో టీడీపీ ప్రకటనల్లో నటించిన వ్యక్తులే ఇప్పుడు రైతుల తరహాలో ముసుగేసుకుని వచ్చారు చూడండి అంటూ… వీడియోలను సోషల్ మీడియాలో ఉంచుతున్నారు. సదరు టీడీపీ ఆర్టిస్టుల వ్యాఖ్యలు కూడా అత్యంత అభ్యంతరకరంగా ఉన్నాయి.
ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్‌ను ఉద్దేశించి టీడీపీ ఆర్టిస్టుల చేత దారుణమైన వ్యాఖ్యలు చేయించారు. గొర్రెలు కాచుకునే వాడిని, అనిల్‌కుమార్ యాదవ్ గాడిని మంత్రిని చేస్తే ఇట్లనే ఉంటుందని ఆర్టిస్ట్‌ల చేత చెప్పించారు. ఇదంతా పెయిడ్ ఆర్టిస్టుల ప్రతాపం అని తేలడంతో నెటిజన్లు టీడీపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. 23 సీట్లకు పడిపోయినా ఇంకా బుద్ధి రాలేదా అని ఫైర్ అవుతున్నారు.
నువ్వు 40 సంవత్సరాల ఇండస్ట్రీ.. ఇండస్ట్రీ అంటుంటే సరదాగా
అంటున్నావేమో అనుకున్నాను.
ఈరోజు అర్దం అయ్యింది మొత్తం ఫిల్మ్ ఇండస్ట్రీ అనమాట..!!
జూనియర్ ఆర్టిస్ట్ లను పెట్టి రాజకీయం చెయ్యాలి అని ఎలా అనిపించింది బాబు గారు మీకు..!?@ncbn
1/2 pic.twitter.com/1CKPWRtLMI— 2024YSRCP (@2024YSRCP) August 20, 2019