భారత క్రికెట్ చీఫ్ కోచ్ గా మళ్ళీ రవిశాస్త్రి
2021 టీ-20 ప్రపంచకప్ వరకూ కాంట్రాక్టు ఐదుస్తంభాలాటలో నెగ్గిన రవిశాస్త్రి ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు చీఫ్ కోచ్ పదవిని …ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి నిలబెట్టుకొన్నాడు. చీఫ్ కోచ్ రేస్ లో మరో నలుగురు ప్రత్యర్థులతో పోటీపడిన రవిశాస్త్రి వైపే.. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహామండలి మొగ్గు చూపింది. ముంబైలో ముగిసిన చీఫ్ కోచ్ ఇంటర్వ్యూ రేస్ నుంచి విండీస్ కు చెందిన ఫిల్ సిమ్మన్స్ ఉపసంహరించుకోగా.. ప్రస్తుత కోచ్ […]
- 2021 టీ-20 ప్రపంచకప్ వరకూ కాంట్రాక్టు
- ఐదుస్తంభాలాటలో నెగ్గిన రవిశాస్త్రి
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన భారత క్రికెట్ బోర్డు చీఫ్ కోచ్ పదవిని …ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి నిలబెట్టుకొన్నాడు. చీఫ్ కోచ్ రేస్ లో మరో నలుగురు ప్రత్యర్థులతో పోటీపడిన రవిశాస్త్రి వైపే.. కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత క్రికెట్ సలహామండలి మొగ్గు చూపింది.
ముంబైలో ముగిసిన చీఫ్ కోచ్ ఇంటర్వ్యూ రేస్ నుంచి విండీస్ కు చెందిన ఫిల్ సిమ్మన్స్ ఉపసంహరించుకోగా.. ప్రస్తుత కోచ్ రవి శాస్త్రి కరీబియన్ ద్వీపాల నుంచి స్కైప్ ద్వారా ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.
కాగా…న్యూజిలాండ్ కు చెందిన మైక్ హెస్సెన్, ఆస్ట్ర్రేలియాకు చెందిన టామ్ మూడీ, భారత మాజీ క్రికెటర్లు లాల్ చంద్ రాజ్ పుట్, రాబిన్ సింగ్ మాత్రం నేరుగా ఇంటర్వ్యూకు హాజరై తమతమ ప్రణాళికల గురించి ముగ్గురు సభ్యుల ఎంపిక సంఘానికి వివరించారు. అయితే ..అందరూ ఊహించిన విధంగానే ఎంపిక సంఘం ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రి నే ఎంపిక చేసింది.
ఏడాదికి 7 కోట్ల 50 లక్షల కాంట్రాక్టు..
ఆస్ట్ర్రేలియా వేదికగా జరిగే 2021 టీ-20 ప్రపంచకప్ వరకూ రవిశాస్త్రికి తిరిగి కాంట్రాక్టు ఇచ్చారు. ఏడాదికి 7 కోట్ల 50లక్షల రూపాయలు వేతనంగా ఇవ్వనున్నారు.
బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ గా శ్రీధర్ తిరిగి కాంట్రాక్టు పొందే అవకాశం కనిపిస్తోంది. బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ పరిస్థితి మాత్రం అయోమయంగా తయారయ్యింది.
నంబర్ ఫోర్ స్థానానికి సరైన ఆటగాడిని ఎంపిక చేయడంలో విఫలం కావడం బంగర్ పాలిట శాపంగా మారింది.
ఇదీ రవిశాస్త్రి ట్రాక్ రికార్డు..
భారత మాజీ కెప్టెన్ అనీల్ కుంబ్లే చీఫ్ కోచ్ గా విజయవంతమైనా… కెప్టెన్ కొహ్లీతో అభిప్రాయబేధాలు కారణంగా తప్పుకోవాల్సి వచ్చింది.
అయితే ..2017లో కుంబ్లే స్థానంలో చీఫ్ కోచ్ గా బాధ్యతలు చేపట్టిన రవి శాస్త్రి…జట్టుకు పలు చిరస్మరణీయ విజయాలు అందించారు.
భారత్ ను రెండుసార్లు ఆసియాకప్ విజేతగా నిలపడం మాత్రమే కాదు..ఆస్ట్ర్రేలియాను ఆస్ట్ర్లేలియా గడ్డపై ఓడించడం ద్వారా.. తొలిసారిగా భారతజట్టు టెస్ట్ సిరీస్ నెగ్గడం లోనూ రవి శాస్త్రి కోచ్ గా ప్రధానపాత్ర వహించారు.
శాస్త్రి కోచ్ గా 21 టెస్టులు ఆడిన భారత్ 13 విజయాలు, 36 టీ-20ల్లో 25 విజయాలు, 60 వన్డేల్లో 43 విజయాలు నమోదు చేసింది.
రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారతజట్టు మొత్తం 70 శాతం విజయాలు నమోదు చేయటం విశేషం. రానున్న రెండేళ్ల కాలంలో రవిశాస్త్రి చీఫ్ కోచ్ గా భారతజట్టు మరెన్ని అద్భుతాలు చేస్తుందో మరి.