సెప్టెంబర్ 17.... బీజేపీ వేస్తున్న పెద్ద స్కెచ్ ఇదే !
తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ఈ మేరకు అందివస్తున్న అవకాశాన్ని ఈసారి చక్కగా వినియోగించుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. హిందుత్వవాదాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకున్న బీజేపీ… ఇప్పుడు అదే ఆయుధాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిపై నెట్టి ఇరుకునపెట్టాలని యోచిస్తోంది. అదే సమయంలో మజ్లిస్ ను కూడా ఇబ్బంది పెట్టాలని స్కెచ్ గీసింది. సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినం. ఈ దినాన్ని బేస్ చేసుకొని జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను తెలంగాణ రప్పించి… పెద్ద ఎత్తున […]
తెలంగాణలో బలపడాలని యోచిస్తున్న బీజేపీ ఈ మేరకు అందివస్తున్న అవకాశాన్ని ఈసారి చక్కగా వినియోగించుకోవాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. హిందుత్వవాదాన్నే ప్రధాన ఆయుధంగా మార్చుకున్న బీజేపీ… ఇప్పుడు అదే ఆయుధాన్ని తెలంగాణ రాష్ట్ర సమితిపై నెట్టి ఇరుకునపెట్టాలని యోచిస్తోంది. అదే సమయంలో మజ్లిస్ ను కూడా ఇబ్బంది పెట్టాలని స్కెచ్ గీసింది.
సెప్టెంబర్ 17. తెలంగాణ విమోచన దినం. ఈ దినాన్ని బేస్ చేసుకొని జాతీయ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను తెలంగాణ రప్పించి… పెద్ద ఎత్తున కార్యక్రమాలకు రాష్ట్ర బీజేపీ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట.
తెలంగాణ విమోచనంలో గుజరాతీ, భారత ఉప ప్రధాని సర్ధార్ వల్లభాయ్ పటేల్ చూపించిన తెగువను గుర్తు చేస్తూ టీఆర్ఎస్ మైనార్టీ ఓట్ల కోసం ఈ విమోచన దినోత్సవాన్ని నిర్వహించకపోవడంపై…. ఇరుకున పెట్టాలని యోచిస్తున్నాయట..
తెలంగాణలో 4 ఎంపీ సీట్లు గెలిచి బీజేపీ ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ను తుత్తునియలు చేసి టీఆర్ఎస్ కు ధీటుగా బలపడాలని యోచిస్తోంది. అందులో భాగంగానే అందివచ్చిన ఈ విమోచన దినాన్ని ఉపయోగించుకోవాలని యోచిస్తోంది. విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహించాలని టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవడంతోపాటు అమిత్ షాను తీసుకొచ్చి జెండా కూడా ఎగురవేయాలని బీజేపీ స్కెచ్ గీసినట్టు సమాచారం. మరి దీనికి కౌంటర్ గా టీఆర్ఎస్ ఎలాంటి ప్రతివ్యూహాలను సిద్ధం చేస్తుందనేది వేచిచూడాలి.