ఎల్‌ఐసీని అమ్మకానికి పెడుతున్న మోడీ సర్కార్
ఎల్‌ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లానన్న మోడీ సర్కార్ నిర్ణయం కలకలం రేపుతోంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీ దారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాభాలు, ఆస్తులతో అత్యంత బలంగా ఉన్న ఎల్‌ఐసీని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఎల్‌ఐసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఎల్‌ఐసీకి 34.11 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కోట్లాది మందికి బీమా అందిస్తోంది. ఎల్‌ఐసీ ఏటా 5.6 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది. ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ద్వారా ఎల్‌ఐసీలో […]
ఎల్‌ఐసీని పబ్లిక్ ఇష్యూకు తీసుకెళ్లానన్న మోడీ సర్కార్ నిర్ణయం కలకలం రేపుతోంది. ఎల్‌ఐసీ ఉద్యోగులు, పాలసీ దారుల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. లాభాలు, ఆస్తులతో అత్యంత బలంగా ఉన్న ఎల్‌ఐసీని కార్పొరేట్ శక్తులకు అప్పగించేందుకు కుట్ర జరుగుతోందని ఎల్‌ఐసీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
ఎల్‌ఐసీకి 34.11 లక్షల కోట్ల విలువైన ఆస్తులున్నాయి. కోట్లాది మందికి బీమా అందిస్తోంది. ఎల్‌ఐసీ ఏటా 5.6 లక్షల కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తోంది.
ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం ద్వారా ఎల్‌ఐసీలో వాటాలను విక్రయించి లక్షా ఐదు వేల కోట్లు సమీకరించుకోవాలని మోడీ సర్కార్ భావిస్తోంది. ఇది ఎల్‌ఐసీని ప్రైవేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి తొలి అడుగుగా భావిస్తున్నారు.
మోడీ సర్కార్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఎల్‌ఐసీ ఉద్యోగులు అప్పుడే నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దేశంలో ప్రజలకు బీమా ధీమా కూడా లేకుండా కేంద్రం చేస్తోందని మండిపడ్డారు.
34 లక్షల కోట్ల ఎల్‌ఐసీ ఆస్తులపై కార్పొరేట్ శక్తుల కన్నుపడిందని… అందులో భాగంగా మోడీ సర్కార్ ఎల్‌ఐసీని ప్రైవేట్ పరం చేసేందుకు తొలి అడుగులు వేస్తోందని వారు ఆరోపిస్తున్నారు.