భారత క్రికెట్ కోచ్ పోస్టులకు దరఖాస్తుల వెల్లువ
బీసీసీఐకి చేరిన 2వేల దరఖాస్తులు ఆగస్టు 14, 15 తేదీలలో ఇంటర్వ్యూలు ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు భారత్…తన సీనియర్ జట్టు చీఫ్ కోచ్, సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. ఆగస్టు 14, 15 తేదీలలో జరిగే చీఫ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పోస్టులతో పాటు ఫిజియో థెరపిస్ట్, ఫిజికల్ ట్రెయినర్, ఇతర సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో మొత్తం 2వేల దరఖాస్తులు తమకు చేరినట్లు బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ […]
- బీసీసీఐకి చేరిన 2వేల దరఖాస్తులు
- ఆగస్టు 14, 15 తేదీలలో ఇంటర్వ్యూలు
ప్రపంచంలోనే అత్యంత భాగ్యవంతమైన క్రికెట్ బోర్డు భారత్…తన సీనియర్ జట్టు చీఫ్ కోచ్, సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
ఆగస్టు 14, 15 తేదీలలో జరిగే చీఫ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పోస్టులతో పాటు ఫిజియో థెరపిస్ట్, ఫిజికల్ ట్రెయినర్, ఇతర సహాయక సిబ్బంది కోసం దరఖాస్తులు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో మొత్తం 2వేల దరఖాస్తులు తమకు చేరినట్లు బీసీసీఐ ప్రకటించింది.
చీఫ్ కోచ్ పోస్ట్ కోసం పోటాపోటీ…
బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్ పోస్టులకు ప్రవీణ్ ఆమ్రే, వెంకటేశ్ ప్రసాద్, జాంటీ రోడ్స్ సైతం తమ దరఖాస్తులు పంపారు.
ప్రస్తుతం భారతజట్టు బ్యాటింగ్ కోచ్ గా సంజయ్ బంగర్, బౌలింగ్ కోచ్ గా భరత్ అరుణ్, ఫీల్డింగ్ కోచ్ గా ఆర్. శ్రీధర్, టీమ్ మేనేజర్ గా సునీల్ సుబ్రమణ్యం, ఫిజియో థెరపిస్ట్ గా ప్యాట్రిక్ ఫర్హత్, ఫిజికల్ ట్రెయినర్ గా శంకర్ బాసు వ్యవహరిస్తున్నారు.
భారత చీఫ్ కోచ్, సహాయక సిబ్బంది పదవీకాలం ప్రపంచకప్ తోనే ముగిసింది. అయితే కొత్త సిబ్బంది నియామక కార్యక్రమం ముగియటానికి వీలుగా మరో 45 రోజులపాటు కాంట్రాక్టు పొడిగించారు.
కరీబియన్ ద్వీపాలలో భారతజట్టు నెలరోజుల పర్యటన ముగిసే వరకూ రవి శాస్త్రి అండ్ కో తమ తమ పోస్టుల్లో కొనసాగనున్నారు.
చీఫ్ కోచ్ ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీ…
భారత చీఫ్ కోచ్ ఎంపిక కోసం…కపిల్ దేవ్, అంశుమన్ గయక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన ముగ్గురు సభ్యుల ఎంపిక సంఘాన్ని బీసీసీఐ పాలకమండలి ఏర్పాటు చేసింది.
ముంబై వేదికగా ఆగస్టు 14, 15 తేదీలలో చీఫ్ కోచ్ పోస్ట్ కోసం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.