భానుకిరణ్‌కు మరో మూడేళ్ల శిక్ష
మద్దెలచెరువు సూరి హత్య కేసులో ఇప్పటికే జీవితఖైదు పడ్డ నేరస్తుడు భానుకిరణ్‌కు అక్రమ ఆయుధాల కేసులోనూ శిక్ష పడింది. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదారి పట్టించి ఆయుధాలను తీసుకున్నందుకు గాను నాంపల్లి క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో ఈ కేసు నమోదు అయింది. ఖమ్మం ఎస్పీకి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి భానుకిరణ్ తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత గడువు ముగిసినా సరే దాన్ని తిరిగి అప్పగించలేదు. భానుకిరణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో […]
మద్దెలచెరువు సూరి హత్య కేసులో ఇప్పటికే జీవితఖైదు పడ్డ నేరస్తుడు భానుకిరణ్‌కు అక్రమ ఆయుధాల కేసులోనూ శిక్ష పడింది. తప్పుడు సమాచారంతో పోలీసులను తప్పుదారి పట్టించి ఆయుధాలను తీసుకున్నందుకు గాను నాంపల్లి క్రిమినల్ కోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. 2011లో ఈ కేసు నమోదు అయింది.
ఖమ్మం ఎస్పీకి తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి భానుకిరణ్ తుపాకీ లైసెన్స్ తీసుకున్నాడు. ఆ తర్వాత గడువు ముగిసినా సరే దాన్ని తిరిగి అప్పగించలేదు. భానుకిరణ్‌ను అరెస్ట్ చేసిన సమయంలో అతడి నుంచి తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పుడు విచారించగా తప్పుడు పత్రాల సాయంతో లైసెన్స్ తెచ్చుకుని దాన్ని అక్రమంగా ఉంచుకున్నట్టు తేలింది. దాంతో అతడిపై కేసు నమోదు చేశారు.
2011 జనవరిలో మద్దెలచెరువు సూరిని భానుకిరణ్ హత్య చేశాడు. ఆ కేసులో 2018 డిసెంబర్‌లో కోర్టు అతడికి జీవిత ఖైదు విధించింది. ప్రస్తుతం భానుకిరణ్ జైలులోనే జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు.