ప్రణబ్ కి ఆగస్టు 8వ తేదీన భారత రత్న అవార్డు...
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆగస్టు 8వ తేదీన భారత రత్న అవార్డు ప్రదానం చేస్తారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జనవరి 19న ప్రణబ్‌కి ఈ అత్యున్నత భారత పౌర పురస్కారాన్ని ప్రకటించారు. ఈయనతో పాటు మరణానంతరం ప్రముఖ సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కు కూడా ఈ పురస్కారం ప్రకటించారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దశాబ్దాలుగా ప్రణబ్ చేసిన సేవను కొనియాడుతూ ట్వీట్ చేశారు. “ప్రణబ్ […]
భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆగస్టు 8వ తేదీన భారత రత్న అవార్డు ప్రదానం చేస్తారు. ఆయన రాష్ట్రపతిగా ఉన్నప్పుడు జనవరి 19న ప్రణబ్‌కి ఈ అత్యున్నత భారత పౌర పురస్కారాన్ని ప్రకటించారు. ఈయనతో పాటు మరణానంతరం ప్రముఖ సామాజిక కార్యకర్త నానాజీ దేశ్ ముఖ్, ప్రముఖ అస్సామీ గాయకుడు భూపేన్ హజారికా కు కూడా ఈ పురస్కారం ప్రకటించారు.
ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్రమోడీ దశాబ్దాలుగా ప్రణబ్ చేసిన సేవను కొనియాడుతూ ట్వీట్ చేశారు. “ప్రణబ్ దా మన కాలంలో ఉన్న గొప్ప రాజనీతిజ్ఞులు. దశాబ్దాలుగా అలుపెరగని నిస్వార్థ సేవ ద్వారా ఈ దేశ అభివృద్ధి మఖచిత్రంపై తన ముద్రను వదిలారు. జ్ఞానం, మేధస్సు విషయంలో ఆయనకు సాటి మరొకరు లేరు. ఆయనకు భారత రత్న పురస్కారం రావడం నన్ను ఆనందపరవశుడ్ని చేస్తున్నది” అంటూ స్పందించారు.
రాహుల్ గాంధీ కూడా ప్రణబ్ కు శుభాకాంక్షలు తెలిపారు. “ప్రణబ్ దా కు శుభాకాంక్షలు. దేశాభివృద్ధికి, ప్రజాసేవకు మీరు చేసిన గొప్ప కృషిని గుర్తిస్తూ ఇచ్చిన ఈ అత్యున్నత పురస్కారం చూసి… మాలో ఒకరైన మిమ్మల్ని చూసి కాంగ్రెస్ పార్టీ గర్విస్తున్నది” అంటూ ట్వీట్ చేశారు.