పీఏసీ విషయంలో వారికి మొండిచేయి
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్ ఎంపికయ్యారు. కేబినెట్ హోదా ఉండే ఈ పదవిని ప్రతిపక్షానికి ఇస్తారు. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల పేరును చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ పదవి కోసం టీడీపీలో గంటా శ్రీనివాస్, బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు పోటీ పడ్డారు. పీఏసీ పదవి కోసమే గంటా బీజేపీలో చేరికను వాయిదా వేసుకున్నారన్న ప్రచారం కూడా సాగింది. అయినప్పటికీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. పయ్యావులను ఎంపిక […]
ఏపీ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్ ఎంపికయ్యారు. కేబినెట్ హోదా ఉండే ఈ పదవిని ప్రతిపక్షానికి ఇస్తారు. ఈ నేపథ్యంలో పీఏసీ చైర్మన్‌గా పయ్యావుల పేరును చంద్రబాబు ఎంపిక చేశారు. ఈ పదవి కోసం టీడీపీలో గంటా శ్రీనివాస్, బుచ్చయ్యచౌదరి, అచ్చెన్నాయుడు పోటీ పడ్డారు.
పీఏసీ పదవి కోసమే గంటా బీజేపీలో చేరికను వాయిదా వేసుకున్నారన్న ప్రచారం కూడా సాగింది. అయినప్పటికీ ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల వైపే చంద్రబాబు మొగ్గు చూపారు. పయ్యావులను ఎంపిక చేయడం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలు ఉన్నాయి.
పయ్యావుల కేశవ్ కూడా బీజేపీ నేతలతో టచ్‌లో ఉన్నట్టు వార్తలొచ్చాయి. తానా సభల్లో బీజేపీ పెద్దలతో పయ్యావుల సమావేశం అయ్యారన్న ప్రచారం జరిగింది.
ఈ నేపథ్యంలో పయ్యావుల వైపు చంద్రబాబు మొగ్గు చూపినట్టు భావిస్తున్నారు. దీనికి తోడు పయ్యావుల కేశవ్ గెలిచిన ప్రతిసారి టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమవుతూ వస్తోంది. దాంతో మంత్రి పదవి అవకాశం ఇప్పటి వరకు పయ్యావులకు దక్కలేదు. ప్రస్తుతం పీఏసీ చైర్మన్ పదవి ఇవ్వడానికి ఇది కూడా ఒక కారణంగా భావిస్తున్నారు.