సీనియర్ ఆటగాడి పై బీసీసీఐ సీరియస్
నిబంధనలకు విరుద్ధంగా భార్యతో ఉన్న సీనియర్ క్రికెటర్ పై చర్యలకు బీసీసీఐ సిద్దమవుతోంది. సదరు ఆటగాడు ప్రపంచకప్ టోర్నీలో బీసీసీఐ నిబంధనలను ఉల్లఘించాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోర్నీ జరుగుతున్న వేళ తన భార్యతో కలిసి ఉండడానికి తొలుత ఆ క్రికెటర్ బీసీసీఐని అభ్యర్థించాడు. అయితే బీసీసీఐ నిరాకరించింది. టోర్నీ మధ్యలో 15 రోజులపాటు ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతించినా.. ఆ క్రికెటర్ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ మొత్తం […]
నిబంధనలకు విరుద్ధంగా భార్యతో ఉన్న సీనియర్ క్రికెటర్ పై చర్యలకు బీసీసీఐ సిద్దమవుతోంది.
సదరు ఆటగాడు ప్రపంచకప్ టోర్నీలో బీసీసీఐ నిబంధనలను ఉల్లఘించాడనే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టోర్నీ జరుగుతున్న వేళ తన భార్యతో కలిసి ఉండడానికి తొలుత ఆ క్రికెటర్ బీసీసీఐని అభ్యర్థించాడు. అయితే బీసీసీఐ నిరాకరించింది.
టోర్నీ మధ్యలో 15 రోజులపాటు ప్రతీ ఆటగాడు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు అధికారులు అనుమతించినా.. ఆ క్రికెటర్ నిబంధనలను ఉల్లంఘించి టోర్నీ మొత్తం తన భార్యతోనే కలిసి ఉన్నాడని బీసీసీఐ గుర్తించింది. ఆ క్రికెటర్ తన భార్యతో కలిసి ఉండేందుకు కెప్టెన్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిల అనుమతి కూడా తీసుకోలేదు.. ఎవరి అనుమతీ లేకుండా ఆటగాడు ఏడు వారాల పాటు తన భార్యతో కలిసి ఉంటే జట్టు మేనేజర్ ఏం చేస్తున్నారని ఒక అధికారి ప్రశ్నించాడు.
దీని పై విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని బీసీసీఐ అధికారి స్పష్టంచేశారు. అయితే ఆ ఆటగాడి పేరు బయటకు చెప్పేందుకు బీసీసీఐ సుముఖంగా లేదు.