ఇస్మార్ట్ శంకర్ బ్రేక్ ఈవెన్ అవుతుందా?

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మొదటి రోజు ఏకంగా వరల్డ్ వైడ్ 16 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 7 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రామ్ కెరీర్ లోనే ఈ సినిమా హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు.. ఓపెనింగ్స్ లో కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. అయితే ఈ ఓపెనింగ్స్ కే హిట్ అందామా? ఇస్మార్ట్ శంకర్ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనా? […]

Advertisement
Update:2019-07-20 07:00 IST

ఇస్మార్ట్ శంకర్ సినిమాకు మొదటి రోజు ఏకంగా వరల్డ్ వైడ్ 16 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే 7 కోట్ల 80 లక్షల రూపాయల షేర్ వచ్చింది. రామ్ కెరీర్ లోనే ఈ సినిమా హయ్యస్ట్ ప్రీ-రిలీజ్ బిజినెస్ చేయడంతో పాటు.. ఓపెనింగ్స్ లో కూడా రామ్ కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచింది. అయితే ఈ ఓపెనింగ్స్ కే హిట్ అందామా? ఇస్మార్ట్ శంకర్ సినిమా సేఫ్ జోన్ లోకి వెళ్లినట్టేనా?

నిజానికి ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 19 కోట్ల 15 లక్షల రూపాయల ప్రీ-రిలీజ్ బిజినెస్ చేసింది. మొదటి రోజు షేర్ ను మినహాయిస్తే ఈ సినిమాకు ఇంకా 12 కోట్ల రూపాయల షేర్ రావాలి. ఇప్పటికే సినిమాకు మిక్స్ డ్ వచ్చేసింది. ఫ్యామిలీ ఆడియన్స్ కు దూరమైంది. ఇలాంటి టైమ్ లో ఈ సినిమా అదనంగా మరో 12 కోట్ల రూపాయలు సంపాదించాలి.

మరోవైపు వారం రోజులాగితే డియర్ కామ్రేడ్, గుణ, రాక్షసుడు లాంటి సినిమాలు వస్తున్నాయి. వాటిని తట్టుకొని మరీ ఇస్మార్ట్ శంకర్ వసూళ్లు సాధించాల్సి ఉంది. ఈ సినిమా సేఫ్ వెంచర్ అవుతుందా లేదో తెలియాలంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.

బయ్యర్ల సంగతి పక్కనపెడితే నిర్మాతలుగా పూరి, చార్మి మాత్రం ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమాను మంచి రేటుకు అమ్ముకున్నారు వీళ్లు. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలిపి అటుఇటుగా 36 కోట్ల రూపాయలకు సినిమాను అమ్మేశారు.

Tags:    
Advertisement

Similar News