భారత టీటీ జట్ల డబుల్ ధమాకా
కామన్వెల్త్ టీటీలో తిరుగులేని భారత్ మహిళల ఫైనల్లో సింగపూర్ పై సంచలన విజయం భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కటక్ వేదికగా జరుగుతున్న 2019 కామన్వెల్త్ టీటీ టీమ్ విభాగంలో భారతజట్లు తిరుగులేని చాంపియన్లుగా నిలిచాయి. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో టైటిల్ వేటకు దిగిన భారత్ ట్రోఫీ నిలుపుకోగా…మహిళల ఫైనల్లో భారతజట్టు తొలిసారిగా విజేతగా నిలిచింది. హోరాహోరీగా సాగిన పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 3-2తో ఇంగ్లండ్ ను అధిగమించి తన ఆధిపత్యాన్ని […]
- కామన్వెల్త్ టీటీలో తిరుగులేని భారత్
- మహిళల ఫైనల్లో సింగపూర్ పై సంచలన విజయం
భారత టేబుల్ టెన్నిస్ మహిళల జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. కటక్ వేదికగా జరుగుతున్న 2019 కామన్వెల్త్ టీటీ టీమ్ విభాగంలో భారతజట్లు తిరుగులేని చాంపియన్లుగా నిలిచాయి.
హోరాహోరీగా సాగిన పురుషుల టీమ్ ఫైనల్లో భారత్ 3-2తో ఇంగ్లండ్ ను అధిగమించి తన ఆధిపత్యాన్ని చాటుకొంది.
మహిళాజట్టు సరికొత్త చరిత్ర…
కామన్వెల్త్ దేశాల మహిళల టీటీ అనగానే ఏడుసార్లు విజేత సింగపూర్ తిరుగులేని ఆధిపత్యమే కనిపిస్తుంది.
అయితే… తొలిసారిగా భారత మహిళల జట్టు సింగపూర్ ను కంగు తినిపించి టైటిల్ సొంతం చేసుకొంది.
ఏకపక్షంగా సాగిన ఫైనల్లో భారత్ 3-0తో సింగపూర్ పై విజయం సాధించింది. 1997 నుంచి వరుసగా ఏడుసార్లు టైటిల్ నెగ్గుతూ వచ్చిన సింగపూర్ ఎనిమిదో టైటిల్ ఆశలపై భారత్ నీళ్లు చల్లింది.
భారత పురుషుల జట్టులో తెలుగుతేజం శరత్ కమల్, సత్యన్, హర్మీత్ దేశాయ్ సభ్యులుగా ఉన్నారు. మహిళల జట్టులో అర్చన గిరీశ్ కామత్, మనీకా బాత్రా, మధురిక పట్కర్ సభ్యులుగా ఉన్నారు.
కామన్వెల్త్ టేబుల్ టెన్నిస్ పోటీలకు కటక్ వేదికగా నిలవడం ఇదే మొదటిసారి.