ఏయ్... కళ్లు పెద్దవి చేస్తే భయపడేవాడు ఎవడూ లేడిక్కడ " జగన్ ఫైర్
ఏపీ అసెంబ్లీ రెండోరోజు ప్రారంభంలోనే సభ అట్టుడికింది. కరువు పై చర్చ కొనసాగించాలని టీడీపీ పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. నిన్ననే ముగిసిన అంశంపై చర్చ కొనసాగించలేమన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చకు అనుమతించాలని… వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు. చంద్రబాబు లేవనెత్తిన అంశంపై జగన్ తిరిగి సమాధానం ఇస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడ్డారు. దాంతో జగన్ ఒక దశలో తీవ్రంగా స్పందించారు. బుద్ది జ్ఞానం లేకుండా […]
ఏపీ అసెంబ్లీ రెండోరోజు ప్రారంభంలోనే సభ అట్టుడికింది. కరువు పై చర్చ కొనసాగించాలని టీడీపీ పట్టుబట్టింది. ఇందుకు స్పీకర్ తిరస్కరించారు. నిన్ననే ముగిసిన అంశంపై చర్చ కొనసాగించలేమన్నారు. అయితే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి జోక్యం చేసుకుని చర్చకు అనుమతించాలని… వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
చంద్రబాబు లేవనెత్తిన అంశంపై జగన్ తిరిగి సమాధానం ఇస్తున్న సమయంలో టీడీపీ సభ్యులు పదేపదే అడ్డుపడ్డారు. దాంతో జగన్ ఒక దశలో తీవ్రంగా స్పందించారు.
బుద్ది జ్ఞానం లేకుండా వ్యవహరించవద్దని టీడీపీ ఎమ్మెల్యేలను హెచ్చరించారు. చంద్రబాబును ఉద్దేశించి కళ్లు పెద్దవి చేసి చూస్తే భయపడేవాడు ఎవడూ లేరిక్కడ అంటూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. బుద్ది జ్ఞానం లేకుండా వ్యవహరించే మీరు ఎలా ఎమ్మెల్యేలు అయ్యారని ప్రశ్నించారు.
వయసు పెరిగితే సరిపోదు… బుద్ధి పెరగాలి … అని వ్యాఖ్యానించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మీ తరహాలోనే గొడవ చేస్తే 23 మంది సభలో కూడా కూర్చోలేరని జగన్ హెచ్చరించారు.
చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు తమ పార్టీ ఎమ్మెల్యేలు మౌనంగా కూర్చున్నారని… కానీ ముఖ్యమంత్రిగా తాను సమాధానం ఇస్తుంటే మాత్రం పదేపదే అడ్డుపడడం ఏం సంస్కారం అని నిలదీశారు.
ఇదే తరహాలో మేం వ్యవహరించి ఉంటే చంద్రబాబు సభలో మాట్లాడి ఉండేవారా? అని ప్రశ్నించారు. మొత్తం రౌడీలను, గూండాలను తయారు చేసుకుని టీడీపీ వాళ్లు అసెంబ్లీకి వచ్చారని జగన్ మండిపడ్డారు.