బాలయ్య, ఎన్టీఆర్ నిజంగా కలుస్తారా?

2 రోజులుగా ఒకటే పుకార్లు. బాలయ్య-ఎన్టీఆర్ కలిసిపోతున్నారట. కలిసి సినిమా చేస్తారట. కల్యామ్ రామ్ నిర్మాతగా ఆ సినిమా రాబోతోందట. చెప్పుకోడానికి క్రేజీగా ఉన్నప్పటికీ, నమ్మడానికి మాత్రం వీల్లేకుండా ఉంది ఈ పుకారు. చివరికి కల్యాణ్ రామ్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపినా కూడా వర్కవుట్ అవ్వని కాంబినేషన్ ఇది. మరి ఇంత అసాధ్యం అనుకున్నప్పుడు పుకారు ఎలా వచ్చింది? అక్కడికే వస్తున్నాం. రీసెంట్ గా ఓ దర్శకుడు కల్యాణ్ రామ్ కు ఓ స్టోరీ వినిపించాడు. […]

Advertisement
Update:2019-06-29 12:48 IST

2 రోజులుగా ఒకటే పుకార్లు. బాలయ్య-ఎన్టీఆర్ కలిసిపోతున్నారట. కలిసి సినిమా చేస్తారట. కల్యామ్ రామ్ నిర్మాతగా ఆ సినిమా రాబోతోందట. చెప్పుకోడానికి క్రేజీగా ఉన్నప్పటికీ, నమ్మడానికి మాత్రం వీల్లేకుండా ఉంది ఈ పుకారు. చివరికి కల్యాణ్ రామ్ రంగంలోకి దిగి మధ్యవర్తిత్వం నెరిపినా కూడా వర్కవుట్ అవ్వని కాంబినేషన్ ఇది.

మరి ఇంత అసాధ్యం అనుకున్నప్పుడు పుకారు ఎలా వచ్చింది? అక్కడికే వస్తున్నాం. రీసెంట్ గా ఓ దర్శకుడు కల్యాణ్ రామ్ కు ఓ స్టోరీ వినిపించాడు. అదొక మల్టీస్టారర్ సినిమా. పైగా ఎన్టీఆర్, బాలయ్యను దృష్టిలో పెట్టుకొని ఆ కథ రాసుకున్నాడట. తనకు వాళ్లిద్దరి అపాయింట్ మెంట్ దొరక్కపోవడంతో, కల్యాణ్ రామ్ ను కలిసి స్టోరీ చెప్పాడు. ఒకవేళ కల్యాణ్ రామ్ కు గనుక స్టోరీ నచ్చితే ఎన్టీఆర్ స్థానంలో అతడ్నే పెట్టి సినిమా చేస్తానన్నాడట.

ఇప్పటివరకు జరిగింది ఇది మాత్రమే. కల్యాణ్ రామ్ వెళ్లి ఎన్టీఆర్ ను కలవలేదు. బాబాయ్ బాలయ్యతో డిస్కస్ కూడా చేయలేదు. అంతలోనే ఈ మేటర్ ఆనోటా ఈనోటా పాకిపోయింది. బాలయ్య-ఎన్టీఆర్ మల్టీస్టారర్ అంటూ కథలు కథలుగా వచ్చేసింది. అదీ సంగతి.

Tags:    
Advertisement

Similar News