పవన్ 150 కోట్ల పై..... వర్మ కామెంట్స్
జనసేన ఘోర ఓటమిపై పవన్ కళ్యాణ్ రివ్యూలు మొదలుపెట్టాడు. ఈ సమీక్షలో భాగంగా పవన్ సంచలన వ్యాఖ్యలే చేశాడు. భీమవరంలో పవన్ ఓడిపోవడానికి ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసి పెద్ద కుట్ర చేశారన్నాడు. అయితే ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు రాంగోపాల్ వర్మ. తనను ఓడించడానికి రూ. 150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్నారు వర్మ. పవన్‌ను నిజంగా గెలిపించాలనుకుంటే ఓటర్లు […]
జనసేన ఘోర ఓటమిపై పవన్ కళ్యాణ్ రివ్యూలు మొదలుపెట్టాడు. ఈ సమీక్షలో భాగంగా పవన్ సంచలన వ్యాఖ్యలే చేశాడు. భీమవరంలో పవన్ ఓడిపోవడానికి ఏకంగా 150 కోట్లు ఖర్చు చేసి పెద్ద కుట్ర చేశారన్నాడు.
అయితే ఈ వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్‌లో స్పందించాడు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించారు రాంగోపాల్ వర్మ. తనను ఓడించడానికి రూ. 150 కోట్లు ఖర్చు చేశారన్న పవన్ వ్యాఖ్యలు ఓటర్లను అవమానించడమేనన్నారు వర్మ.
పవన్‌ను నిజంగా గెలిపించాలనుకుంటే ఓటర్లు డబ్బులు తీసుకున్నప్పటికీ అతనికే ఓటు వేసేవారని పవన్ కు గుర్తుచేశాడు. జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ ను ప్రశ్నించాడు వర్మ.
PK saying he lost becos 150cr given to voters is a real insult to voters bcos he’s saying people who he wants to serve r corrupt.If voters wanted him they could take money from othrs nd still voted him.If PK also has to give money for votes what’s point in being PK? Just asking
— Ram Gopal Varma (@RGVzoomin) June 9, 2019