బాలయ్య సినిమాకు దారేది?

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి అంగీకరించాడు బాలయ్య. సినిమాకు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్ కూడా నడిచింది. అయితే అంతలోనే ఆ మూవీ ఆగిపోయింది. దీనికి కారణం తాజా ఎన్నికల ఫలితాలే. సినిమాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి, ఆ సన్నివేశాలు, డైలాగ్స్ మార్చాలని బాలయ్య సూచించాడు. అప్పటివరకు సినిమా చేసేది లేదని చెప్పేశాడు. అలా ఆగిపోయిన ఆ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. […]

Advertisement
Update:2019-06-07 11:25 IST

అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో మరోసారి నటించడానికి అంగీకరించాడు బాలయ్య. సినిమాకు సంబంధించి చిన్నపాటి షెడ్యూల్ కూడా నడిచింది. అయితే అంతలోనే ఆ మూవీ ఆగిపోయింది. దీనికి కారణం తాజా ఎన్నికల ఫలితాలే. సినిమాలో వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయట. ఇప్పుడు అధికారంలో ఉన్నది జగన్ కాబట్టి, ఆ సన్నివేశాలు, డైలాగ్స్ మార్చాలని బాలయ్య సూచించాడు. అప్పటివరకు సినిమా చేసేది లేదని చెప్పేశాడు.

అలా ఆగిపోయిన ఆ సినిమా ఇప్పుడు మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ మూవీకి సంబంధించి అన్ని మార్పులు చేర్పులు పూర్తయ్యాయి. బాలయ్యకు మరోసారి ఫైనల్ నెరేషన్ వినిపించాడు దర్శకుడు కేఎస్ రవికుమార్. దీంతో ఈ ప్రాజెక్టులో నటించేందుకు బాలయ్య మళ్లీ ఒప్పుకున్నాడట. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈనెల 12నుంచి ఈ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.

సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ నిర్మాతగా ఈ సినిమా రాబోతోంది. హీరోయిన్, విలన్, ఇతర నటీనటులు ఎవరనే విషయం ఇంకా స్పష్టంకాలేదు. వాళ్లెవరూ లేకుండానే, పూర్తిగా బాలయ్యపైన ఓ షెడ్యూల్ జరపాలని నిర్ణయించారు. అలా బాలయ్యతో షెడ్యూల్ పూర్తయిన తర్వాత సినిమాను అఫీషియల్ గా ఎనౌన్స్ చేస్తారట.

బాలయ్య సినిమాలకు సంబంధించి గతంలో ఎన్నడూ ఇంత గోప్యత పాటించలేదు. ఒక్క ఈ సినిమానే ఎందుకింత రహస్యంగా ఉంచుతున్నారనేది అంతుచిక్కకుండా ఉంది.

Tags:    
Advertisement

Similar News