ఇచ్చి పుచ్చుకున్నారు
జగన్ గద్దెనెక్కాక స్నేహగీతం ఆలపించారు. కేసీఆర్ అంతే చొరవ చూపించారు. ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలన్నారు. దానికి పర్యవసనాలే ఈ ఫలితాలు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు లేవు.. ఆధిపత్యం పోరు లేదు.. ఈజీగా ఐదేళ్లుగా ఉన్న చిక్కుముడులను విప్పేయవచ్చు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కోరడం.. దానికి జగన్ ఓకే అనడం రెండు రాష్ట్రాల మధ్య ఎంత సృహద్భావ వాతావరణం ఉందో తేటతెల్లం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతి కావడం.. ఏపీ సచివాలయం ఖాళీ […]
జగన్ గద్దెనెక్కాక స్నేహగీతం ఆలపించారు. కేసీఆర్ అంతే చొరవ చూపించారు. ఖడ్గచాలనం కాదు.. కరచాలనం కావాలన్నారు. దానికి పర్యవసనాలే ఈ ఫలితాలు. ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య గొడవలు లేవు.. ఆధిపత్యం పోరు లేదు.. ఈజీగా ఐదేళ్లుగా ఉన్న చిక్కుముడులను విప్పేయవచ్చు.
తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ కోరడం.. దానికి జగన్ ఓకే అనడం రెండు రాష్ట్రాల మధ్య ఎంత సృహద్భావ వాతావరణం ఉందో తేటతెల్లం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతి కావడం.. ఏపీ సచివాలయం ఖాళీ కావడంతో ఆ భవనాలు అంతా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఏపీ వినియోగించడం లేదు. దీంతో గవర్నర్ ఇఫ్తార్ విందు సందర్భంగా తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్ లు కలిశారు. ఇద్దరి మధ్య ఈ ఖాళీ భవనాల చర్చ జరిగింది. దీంతో జగన్ ఎలాగూ వాడడం లేదని సచివాలయాలను తెలంగాణకు ఇచ్చేశారు. గవర్నర్ వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.
నిజానికి రక్షణ శాఖ ఆధీనంలో ఉన్న పోలో గ్రౌండ్ లో తెలంగాణ కొత్త సచివాలయం నిర్మిద్దామని కేసీఆర్ భావించారు. కానీ కేంద్రంలోని బీజేపీ ఆ స్థలం ఇవ్వడానికి నానా రకాలు కారణాలు చెబుతూ జాప్యం చేస్తోంది. అందుకే ఇప్పుడు ఏపీ భవనాలు ఇచ్చేయడంతో వాటిలో కొన్నింటిని కూల్చి వాస్తు ప్రకారం కొత్త సచివాలయం నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టే అవకాశాలున్నాయి. ఆంధ్రా ప్రభుత్వం అంత ఉదారంగా వ్యవహరించినందుకు ప్రతిగా తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు తెలంగాణకు ఏపీ ప్రభుత్వం బకాయిపడిన ఆస్తి పన్ను, ఇతర చార్జీలను మాఫీ చేయడానికి అంగీకరించింది.
ఇలా ఎన్నడూ లేని విధంగా ఇంత స్నేహహస్తం జగన్ అందించారు. ఆలింగనంలోనే కాదు.. ఆచరణలోనూ తనది స్నేహగీతమేనని నిరూపించారు. ఎడతెగని ఎన్నో పంచాయతీలు రెండు రాష్ట్రాల మధ్య ఉన్నాయి. పోయిన సీఎం చంద్రబాబు కత్తి దూస్తే.. జగన్ మాత్రం స్నేహహస్తం అందిస్తూ తొలి అడుగు వేశారు. ఇలానే పంచాయితీ లేకుండా సాగితే రెండు తెలుగు రాష్ట్రాలకు ఎంతో మేలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.