ఇక రవిప్రకాష్‌ కు వేరే దారి లేదు....

చివరకు సుప్రీం కోర్టు కూడా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేసింది. వివిధ అవినీతి ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి రవిప్రకాష్‌ను తెలంగాణ పోలీసులు తమ ముందు హాజరుకమ్మని నోటీసులు అందజేశారు. అయితే అప్పటి నుంచి రవిప్రకాష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి…. హైకోర్టులో రెండుసార్లు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. ఆ బెయిల్‌ పిటీషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటీషన్‌ను వేశారు. సుప్రీం కోర్టు కూడా బెయిల్‌ పిటీషన్‌ను తిరస్కరిస్తూ ఐపీసీ41ఎ […]

Advertisement
Update:2019-06-03 10:52 IST

చివరకు సుప్రీం కోర్టు కూడా టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాష్‌ ముందస్తు బెయిల్‌ పిటీషన్‌ను కొట్టివేసింది. వివిధ అవినీతి ఆరోపణలు, అక్రమాలకు సంబంధించి రవిప్రకాష్‌ను తెలంగాణ పోలీసులు తమ ముందు హాజరుకమ్మని నోటీసులు అందజేశారు.

అయితే అప్పటి నుంచి రవిప్రకాష్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి…. హైకోర్టులో రెండుసార్లు ముందస్తు బెయిల్‌ కోసం ప్రయత్నించాడు. ఆ బెయిల్‌ పిటీషన్‌లను హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటీషన్‌ను వేశారు. సుప్రీం కోర్టు కూడా బెయిల్‌ పిటీషన్‌ను తిరస్కరిస్తూ ఐపీసీ41ఎ కింద పోలీసులు ఇచ్చిన నోటీసును గౌరవించాల్సిందేనని, విచారణకు హాజరుకావాల్సిందేనని చెప్పింది.

రవిప్రకాష్‌ను అరెస్టు చేయాల్సి వస్తే 48 గంటల ముందు ఆయనకు నోటీసులు ఇవ్వాలని షరతు విధించింది. ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టునే ఆశ్రయించాలని, మేం బెయిల్‌ ఇవ్వలేమని పేర్కొంది.

కాబట్టి ఇక రవిప్రకాష్‌కు పోలీసుల విచారణకు హాజరుకావడం తప్ప వేరే దారి లేకుండా పోయింది.

Tags:    
Advertisement

Similar News