ఏపీకి నోచాన్స్....
కేబినెట్ విస్తరణలో ఏపీకి కేంద్రమంత్రి పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదు మోడీ. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ అస్సలు బలం లేని తమిళనాడు నుంచి కూడా మంత్రి పదవులు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో ఆ రాష్ట్ర పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. మోడీ కేబినెట్ విస్తరణలో కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కకపోవడం విశేషం. ఏపీలో ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో మంత్రి పదవి […]
కేబినెట్ విస్తరణలో ఏపీకి కేంద్రమంత్రి పదవి ఒక్కటి కూడా ఇవ్వలేదు మోడీ. వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ అస్సలు బలం లేని తమిళనాడు నుంచి కూడా మంత్రి పదవులు ఇచ్చారు.
కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాత్రం ప్రాతినిధ్యం కల్పించకపోవడంతో ఆ రాష్ట్ర పార్టీ నేతలను షాక్ కు గురిచేసింది. మోడీ కేబినెట్ విస్తరణలో కర్ణాటక మినహా దక్షిణాది రాష్ట్రాలకు ఆశించిన స్థాయిలో ప్రాతినిధ్యం దక్కకపోవడం విశేషం.
ఏపీలో ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో మంత్రి పదవి ఇవ్వలేదని రాష్ట్ర పార్టీ నేతలు భావించడానికి వీల్లేదు.
ఎందుకంటే కేరళలో కూడా బీజేపీ ఒక్క స్థానం కూడా గెలవలేదు. తమిళనాడులో కూడా బీజేపీ పరిస్థితి తీసికట్టుగానే ఉంది.. కానీ కేరళకు, తమిళనాడుకు చెందిన వారికి కేంద్రమంత్రి పదవులు మోడీ ఇచ్చారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ నుంచి ఒక్కొక్కరికి మంత్రి పదవిని మోడీ కేటాయించారు.
అత్యధికంగా కర్ణాటక నుంచి ముగ్గురికి పదవులు ఇచ్చారు. ఒక్క ఏపీకి చెందిన వారికి మాత్రమే మంత్రి పదవి కేటాయించలేదు.
ఏపీ తరుఫున కేంద్రంలో సీనియర్ బీజేపీ నాయకుడు.. ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహరావు పేరు వినిపించింది. అయితే ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు ఎంపికయ్యారు. ఇప్పటికే మోడీ అత్యధికంగా మంత్రి పదవులను యూపీకి ఇచ్చారు. మొత్తం 11 మంత్రి పదవులు ఇచ్చారు. అందుకే జీవీఎల్ కు కేటాయించలేదు. ఇక ఏపీకి చెందిన పురందేశ్వరీ, కన్నా లక్ష్మీనారాయణ, హరిబాబు, మాణిక్యాల రావు లాంటి నేతలున్నా వారిని మోడీ పరిగణలోకి తీసుకోలేదు.