ఆ విషయంపై పదేపదే రేవంత్ క్లారిటీ !
మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఓ విషయంపై పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. ఆ విషయం మాత్రం ఆయన పదేపదే చెబుతున్నారు. 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు ఓ 30 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో కొంతమంది టీఆర్ఎస్‌లోకి వెళ్లారు. అయితే ఇప్పుడు రేవంత్ మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అప్పుడే ఆయన మీద ఓ రూమర్ మొదలైంది. రేవంత్‌రెడ్డి […]
మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన రేవంత్‌రెడ్డి ఓ విషయంపై పదేపదే క్లారిటీ ఇస్తున్నారు. ఆ విషయం మాత్రం ఆయన పదేపదే చెబుతున్నారు. 2019 ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు రేవంత్ కాంగ్రెస్‌లో చేరారు. ఆయనతో పాటు ఓ 30 మంది నేతలు కాంగ్రెస్‌లో చేరారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో కొంతమంది టీఆర్ఎస్‌లోకి వెళ్లారు.
అయితే ఇప్పుడు రేవంత్ మల్కాజిగిరి నుంచి ఎంపీగా గెలిచారు. అప్పుడే ఆయన మీద ఓ రూమర్ మొదలైంది. రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరతారట. ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయట. కేసీఆర్‌ను ఎదుర్కొవాలంటే కాంగ్రెస్ కరెక్ట్ కాదు. బీజేపీ అయితేనే సరైన పార్టీ అని ఆయన ఆలోచిస్తున్నారట.
రేవంత్ పార్టీ మారుతారనే వార్త వైరల్ అయింది. దీంతో రేవంత్ స్వయంగా వివరణ ఇచ్చారు. గాంధీభవన్‌లో జరిగిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తాను పార్టీ మారడం లేదని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో తమ వ్యాపారం కోసం తన పేరు వాడుకుంటున్నారని వాపోయారు.
తెలంగాణలో ఎంఐఎం సహకారంతో బీజేపీ ఎంపీలు గెలిచారని రేవంత్ దుమ్మెత్తిపోశారు. ప్రతిపక్షంలో ఉండి పోరాడేందుకు ప్రజలు తనను ఎంపీగా గెలిపించారని అన్నారాయన. మొత్తానికి తాను పార్టీ మారడం లేదని మాత్రం రేవంత్ క్లారిటీ ఇచ్చారు.