50 ఓవర్ల ఫార్మాట్లో ఇక 500 పరుగులకు గురి

2019 ప్రపంచకప్ లో 500 స్కోరు కలలు 500 స్కోరు కోసం స్కోరు షీట్లు రెడీ… మే 30 నుంచి ఇంగ్లండ్ లో వన్డే ప్రపంచకప్ ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో …అదీ 300 బాల్స్ లో 500 పరుగుల స్కోరు సాధ్యమేనా?… మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2019 వన్డే ప్రపంచకప్ లో 500 పరుగుల స్కోరు సాధ్యమేనని ఆతిథ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గట్టిగా భావిస్తోంది. మే 30 నుంచి జులై 14 వరకూ […]

Advertisement
Update:2019-05-21 02:55 IST
  • 2019 ప్రపంచకప్ లో 500 స్కోరు కలలు
  • 500 స్కోరు కోసం స్కోరు షీట్లు రెడీ…
  • మే 30 నుంచి ఇంగ్లండ్ లో వన్డే ప్రపంచకప్

ఇన్ స్టంట్ వన్డే క్రికెట్లో …అదీ 300 బాల్స్ లో 500 పరుగుల స్కోరు సాధ్యమేనా?… మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే 2019 వన్డే ప్రపంచకప్ లో 500 పరుగుల స్కోరు సాధ్యమేనని ఆతిథ్య ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు గట్టిగా భావిస్తోంది.

మే 30 నుంచి జులై 14 వరకూ జరిగే ప్రపంచకప్ టోర్నీ ఏదో ఓ మ్యాచ్ లో 500 స్కోరు నమోదు కాకపోదా అని ఎదురు చూస్తున్నారు.

దీనికోసం… నిర్వాహక సంఘం అధికారులు 500 పరుగుల స్కోరు నమోదు చేయటానికి వీలుగా ప్రత్యేక స్కోరు షీట్లు సిద్ధం చేస్తున్నారు. మ్యాచ్ లు జరిగే సమయంలో అభిమానులకు ఈ స్కోరు షీట్లు అందుబాటులో ఉంచాలని నిర్ణయించారు.

500 పరుగులు ఎలా సాధ్యం?

వన్డే క్రికెట్ అంటే ..1975 ప్రపంచకప్ లో 60 ఓవర్ల మ్యాచ్ గా ఉండేవి. ఆ తర్వాత నుంచి 50 ఓవర్ల మ్యాచ్ లుగా మాత్రమే ఉంటూవస్తున్నాయి. వన్డే మ్యాచ్ ఓ ఇన్నింగ్స్ లో 50 ఓవర్లు అంటే 300 బాల్స్.

ఈ మూడువందల బాల్స్ లో 500 స్కోరు సాధించాలంటే…నూటికి నూరుశాతం బ్యాటింగ్ పిచ్ ఉండి తీరాలి. అంతేకాదు… మొత్తం బ్యాటింగ్ ఆర్డర్లో కనీసం ఐదు లేదా ఆరుగురు వీరబాదుడు ఆటగాళ్లు తప్పక ఉండాలి.

అంతేనా…స్వింగ్ బౌలింగ్ కు ఏమాత్రం అనువుకాని పొడివాతావరణం, తెలుపురంగుబంతి ఉండాలి. ఈ పరిస్థితులన్నీ ప్రస్తుత ప్రపంచకప్ వేదిక ఇంగ్లండ్ లో ఉన్న కారణంగానే 500 పరుగుల స్కోరు నమోదు కావడం తథ్యమని.. ఇంగ్లీష్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పెద్దలు గట్టిగా నమ్ముతున్నారు.

పాక్ పై ఇంగ్లండ్ 6 వికెట్లకు 481 పరుగులు

ప్రపంచకప్ కు సన్నాహకంగా పాకిస్థాన్ తో జరుగుతున్న వన్డే సిరీస్ లో భాగంగా నాటింగ్ హామ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్లకు 481 పరుగుల స్కోరు నమోదు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది.

50 ఓవర్లలో 481 పరుగుల స్కోరు సాధించగా లేనిది…500 పరుగులు సాధించడం ఏమంత కష్టంకాబోదని భావిస్తున్నారు.
ఆతిథ్య ఇంగ్లండ్ తో పాటు…విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టులో సైతం రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, రాహుల్, కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వీరబాదుడు మొనగాళ్లున్నారు. తమదైన రోజున వీరంతా తమ బ్యాట్లకు పనిచెబితే…500 స్కోరు నమోదైనా ఆశ్చర్యంలేదని అంటున్నారు.

300 నుంచి 481కి..44 ఏళ్లు

వన్డే క్రికెట్ తొలిరోజుల్లో 300 పరుగుల స్కోరు సాధించడాన్ని గొప్ప ఘనకార్యంగా భావించేవారు. అయితే…ఆ తర్వాతి కాలంలో టెక్నాలజీలో మార్పులు, రెడ్ బాల్ నుంచి వైట్ బాల్ కు చేర్పులు, డే-నైట్ మ్యాచ్ లు, రెండు కొత్తబాల్స్ తో మ్యాచ్ నిర్వహణ లాంటి కారణాలతో పరుగుల వేగం పెరిగిపోయింది.

300నుంచి 400 స్కోర్లు, 400 నుంచి 481 పరుగుల స్కోర్లు సాధించడం సాధారణ విషయంగా మారిపోయింది.

వన్డే క్రికెట్ స్కోర్ల పరిణామ క్రమం…

ఇంగ్లండ్ వేదికగా 1975లో జరిగిన ప్రారంభ ప్రపంచకప్ వన్డే మ్యాచ్ లో తొలిసారిగా ఓ 300 పరుగుల స్కోరు నమోదయ్యింది.
లండన్ వేదికగా భారత్ తో ముగిసిన మ్యాచ్ లో న్యూజిలాండ్ 4 వికెట్లకు 344 పరుగులు స్కోరు సాధించింది. వన్డే క్రికెట్లోని 19వ మ్యాచ్ లో కానీ 300కు పైగా స్కోరు నమోదు కాలేకపోయింది.

12 ఏళ్లకు 350కి పైగా స్కోరు…

వన్డే క్రికెట్ చరిత్రలో స్కోరు 300 నుంచి 350కి చేరటానికి 12 సంవత్సరాలపాటు వేచిచూడాల్సి వచ్చింది. 1987లోకరాచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో శ్రీలంకపై విండీస్ 4 వికెట్లకు 360 పరుగుల స్కోరు సాధించింది. వన్డే చరిత్రలోని 457వమ్యాచ్ లో కానీ 350కి పైగా స్కోరు నమోదు కావడం విశేషం.

2006లో 400 స్కోరు…

300 లేదా 350 స్కోర్లతో మురిసిపోయిన వన్డే క్రికెట్ చరిత్రలో తొలి 400 పరుగుల స్కోరుకు 2006 వరకూ ఓపిక పట్టాల్సి వచ్చింది. 2006లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా 400 పరుగుల స్కోరును తొలిసారిగా సాధించింది. ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది.

వన్డే క్రికెట్ 2వేల 349మ్యాచ్ లో కానీ 4 వికెట్లకు 434 పరుగుల రికార్డు స్కోరు నమోదు కాలేదు.

2019లో 481కి పైగా స్కోరు…

వన్డేల్లో తొలి 450 స్కోరును సాధించిన రికార్డు ఇంగ్లండ్ పేరుతో ఉంది. 2018లో పాక్ పై ఇంగ్లండ్ 450కి పైగా స్కోరు తొలిసారిగా సాధించింది.

అంతేకాదు…వన్డేల్లో 481 పరుగుల స్కోరు నమోదు చేసిన తొలిజట్టు కూడా ఇంగ్లండే కావడం విశేషం. ప్రపంచకప్ కు సన్నాహాకంగా పాక్ తో జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సిరీస్ భాగంగా ..నాటింగ్ హామ్ లో ముగిసిన మ్యాచ్ లో ఇంగ్లండ్ 6 వికెట్లకు 481 పరుగుల స్కోరు నమోదు చేసింది.

నాలుగున్నర దశాబ్దాలవన్డే క్రికెట్ చరిత్రలో ఇంగ్లండ్ సాధించిన 481 పరుగులే అత్యధిక స్కోరు కావడం విశేషం.
ఇంత భారీస్కోర్లు నమోదు కావాలంటే బౌలర్లు ఎంతగా ఊచకోతకు గురికావాలో మరి.

Tags:    
Advertisement

Similar News