ఇండియన్ టెకీలకు ట్రంప్ తీపి కబురు

భారత టెకీల స్వర్గధామం అమెరికా. భారతీయ యువ ఐటీ ఇంజనీర్ల ప్రతిభకు మెచ్చి అమెరికా కంపెనీలన్నీ మన స్టూడెంట్స్ కు కోట్ల ప్యాకేజీలు ఇచ్చి తీసుకెళ్లేవి. మనవాళ్లు డాలర్ల మోజులో పడి అమెరికాపై యావ పెంచుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక భారతీయుల ఆశలకు కళ్లెం పడింది. అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలంటూ ఆయన వలసవిధానాలను మార్చేశారు. ఇండియన్లను అమెరికాకు రాకుండా వీసా నిబంధనలు మార్చారు. అమెరికాలో పనిచేసుకుంటున్న ఇండియన్లను సైతం గ్రీన్ కార్డ్ నిబంధనలకు అడ్డు వేసి […]

Advertisement
Update:2019-05-17 07:26 IST

భారత టెకీల స్వర్గధామం అమెరికా. భారతీయ యువ ఐటీ ఇంజనీర్ల ప్రతిభకు మెచ్చి అమెరికా కంపెనీలన్నీ మన స్టూడెంట్స్ కు కోట్ల ప్యాకేజీలు ఇచ్చి తీసుకెళ్లేవి. మనవాళ్లు డాలర్ల మోజులో పడి అమెరికాపై యావ పెంచుకున్నారు. కానీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక భారతీయుల ఆశలకు కళ్లెం పడింది.

అమెరికన్లకే ఉద్యోగాలివ్వాలంటూ ఆయన వలసవిధానాలను మార్చేశారు. ఇండియన్లను అమెరికాకు రాకుండా వీసా నిబంధనలు మార్చారు. అమెరికాలో పనిచేసుకుంటున్న ఇండియన్లను సైతం గ్రీన్ కార్డ్ నిబంధనలకు అడ్డు వేసి అడ్డుకుంటున్నారు. కొత్తగా హెచ్1బీ దరఖాస్తులను కూడా తిరస్కరిస్తున్నారు. జాప్యం చేస్తున్నారు. దీంతో భారతీయ ఐటీ ఇంజినీర్ల అమెరికా ఆశలకు కళ్లెం పడింది.

తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో స్థిరపడాలనుకునే ఐటీ నిపుణులకు శుభవార్త చెప్పారు. ప్రతిభ ఆధారిత కొత్త వలస విధానాన్ని ప్రకటించారు. గ్రీన్ కార్డుల జారీలో నైపుణ్యానికి ప్రాధాన్యమిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. మెరిట్ బేస్డ్ గ్రీన్ కార్డు కోటాను పెంచాలని ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించింది.

తాజాగా వెలువడిన ఉత్తర్వులు భారతీయ యువ ఐటీ నిపుణులకు కొండంత ధైర్యాన్ని ఇచ్చినట్టైంది. ప్రస్తుతం 12శాతంగా మాత్రమే ఉన్న మెరిట్ బేస్డ్ కోటాను ట్రంప్ ప్రభుత్వం 57శాతానికి పెంచడం విశేషం. దీంతోపాటు అత్యంత నైపుణ్యంగల వ్యక్తులు మాత్రమే అమెరికా లో శాశ్వత నివాసం ఉండేలా యూఎస్ ఇమిగ్రేషన్ పాలసీలో మార్పులు చేసింది.

అయితే అమెరికాలో ఐటీ ఉద్యోగం సంపాదించాలంటే అమెరికా చరిత్ర, సంస్కృతి తదితర అంశాలపై నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. మొత్తంగా 54 ఏళ్ల క్రితం నాటి వలస విధానాన్ని ట్రంప్ మార్పులు చేయడం…. ప్రతిభ, నైపుణ్యం ఆధారంగా అమెరికా వచ్చే వారికి ట్రంప్ ద్వారాలు తెరవడాన్ని భారతీయ ఐటీ నిపుణులు స్వాగతిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News