'ఏబీసీడీ' సినిమా రివ్యూ

రివ్యూ: ఏబీసీడీ రేటింగ్‌: 2.25/5 తారాగణం: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, వెన్నెల కిషోర్, మాస్టర్ భరత్ తదితరులు సంగీతం: జూడా శాండీ నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రాగినేని దర్శకత్వం:  సంజీవ్ రెడ్డి గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న హీరో అల్లు శిరీష్ ఈసారి ఒక యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. మళయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఏబిసిడి అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా […]

Advertisement
Update:2019-05-17 10:06 IST

రివ్యూ: ఏబీసీడీ
రేటింగ్‌: 2.25/5
తారాగణం: అల్లు శిరీష్, రుక్సార్ థిల్లాన్, నాగబాబు, వెన్నెల కిషోర్, మాస్టర్ భరత్ తదితరులు
సంగీతం: జూడా శాండీ
నిర్మాత: మధుర శ్రీధర్ రెడ్డి, యాష్ రాగినేని
దర్శకత్వం: సంజీవ్ రెడ్డి

గత కొంతకాలంగా హిట్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న హీరో అల్లు శిరీష్ ఈసారి ఒక యూత్ ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ తో మన ముందుకు వచ్చాడు. మళయాళంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఏబిసిడి అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ’ సినిమా తెలుగు రీమేక్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకి సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం మే 17న విడుదలైంది.

కథ:

డబ్బు విలువ ఏమాత్రం తెలియకుండా పెరిగిన అవి (అల్లు శిరీష్) విదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ ఉంటాడు. అతనిని ఎలాగైనా మార్చాల్సిందేనని నిర్ణయించుకున్న అతని తండ్రి నాగబాబు, అవి మరియు అతని స్నేహితుడు (మాస్టర్ భరత్) ను ఇండియాకి రప్పిస్తాడు. అప్పటిదాకా విదేశంలో ఉన్న అవి కి భారతదేశం లోని పరిస్థితుల్లో అలవాటు అవుతాయా? అవి తండ్రి అవి కి డబ్బు విలువ తెలిసేలా చేయగలిగాడా? చివరికి ఏం జరిగింది? అనే విషయాలను తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటులు:

అల్లు శిరీష్ ఈ సినిమాలో చాలా కొత్తదనం చూపించాడు. కేవలం తన నటన మాత్రమే కాక తన సరికొత్త లుక్ తో కూడా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు శిరీష్. మిగతా సినిమాలతో పోలిస్తే ఈ సినిమాకు అల్లు శిరీష్ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ మరింత బలాన్ని చేకూర్చింది. రుక్సర్ ధిల్లాన్ ఈ సినిమాకు మరింత అందాన్ని తీసుకొచ్చింది.

సినిమాలో అందంగా కనిపించడమే కాక, తన నటనతో కూడా బాగానే మెప్పించింది. ఈ సినిమాలో నాగబాబు పాత్ర కీలకంగా ఉంటుంది. ఎప్పటిలాగానే తన పాత్రలో ఒదిగిపోయి నటించారు నాగబాబు. మాస్టర్ భరత్ ఈ సినిమాలో బాగానే నటించాడు. వెన్నెల కిషోర్ పాత్ర మరియు నటన కచ్చితంగా నవ్వు తెప్పిస్తాయి. మిగతా నటీనటులు కూడా బాగానే నటించారు.

సాంకేతిక వర్గం:

దర్శకుడు ఈ సినిమాలో మిగతా అన్ని ఎలిమెంట్స్ కంటే కేవలం ఎంటర్ టైన్ మెంట్ పైనే బాగా దృష్టి పెట్టాడు అని తెలుస్తోంది. సినిమా మొదలైన దగ్గర నుంచి అయిపోయే వరకు ప్రేక్షకులను అలరించే విధంగా కడుపుబ్బ నవ్వించే విధంగా ఈ సినిమా రూపొందించారు దర్శకుడు.

జూడా శాండీ అందించిన సంగీతం సినిమాకు బాగా కలిసి వచ్చింది. ఒకటి రెండు పాటలు పర్వాలేదనిపించాయి కానీ నేపధ్య సంగీతం మాత్రం సినిమాకు బాగా సూట్ అయ్యింది. సినిమాటోగ్రాఫర్ రామ్ అందించిన విజువల్స్ కలర్ ఫుల్ గా ఉన్నాయి. నవీన్ నూలి ఎడిటింగ్ బాగుంది.

తీర్పు:

మలయాళం సినిమా రీమేక్ అయినప్పటికీ కథలో చేసిన మార్పులు బాగా సెట్ అయ్యాయి. ఈ సినిమా మొదటి భాగం మొత్తం కేవలం కామెడీ పైనే నడుస్తుంది. అక్కడక్కడా లవ్ ట్రాక్ కూడా జోడించి, కేవలం కామెడీ ఎంటర్ టైన్ మెంట్ ను మాత్రం దట్టించి రూపొందించిన ఈ సినిమా మొదటి హాఫ్ అంతా సాఫీగా సాగిపోతుంది. రెండవ భాగంలో కొన్ని ఎత్తుపల్లాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులకు బోర్ కొట్టించకుండా సినిమాను బాగానే నడిపించారు. సినిమాను ముగించిన విధానం కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. చివరగా ఏబిసిడి అమెరికన్ బోర్న్ కన్ ఫ్యూజ్డ్ దేశీ సినిమా కొన్ని వర్గాల ప్రేక్షకుల ను మెప్పించగల కామెడీ ఎంటర్ టైనర్.

Tags:    
Advertisement

Similar News