క్యాన్సర్ పీడిత బాలుడికి ఫార్ములావన్ ఊరట

బాలుడి ఇంటి లోగిలిలో హామిల్టన్ ఫార్ములావన్ కారు మృత్యుముఖంలోనూ మురిసిపోయిన హ్యారీ షా హ్యారీకి స్పానిష్ జీపీ టైటిల్ ను అంకితమిచ్చిన హామిల్టన్ ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు హ్యారీ షాకు… తన ఈడు అందరి పిల్లల్లానే వేగంగా దూసుకుపోయే కార్లు…అందునా.. ఫార్ములావన్ కార్లు అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు…తమ దేశానికి చెందిన ఫార్ములావన్ చాంపియన్ హామిల్టన్ అంటే మరీ మరీ ఇష్టం. అయితే…ఐదేళ్ల హ్యారీకి వయసుకు మించిన రోగం వచ్చింది. బోన్ మ్యారో […]

Advertisement
Update:2019-05-15 07:25 IST
  • బాలుడి ఇంటి లోగిలిలో హామిల్టన్ ఫార్ములావన్ కారు
  • మృత్యుముఖంలోనూ మురిసిపోయిన హ్యారీ షా
  • హ్యారీకి స్పానిష్ జీపీ టైటిల్ ను అంకితమిచ్చిన హామిల్టన్

ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతానికి చెందిన ఐదేళ్ల బాలుడు హ్యారీ షాకు… తన ఈడు అందరి పిల్లల్లానే వేగంగా దూసుకుపోయే కార్లు…అందునా.. ఫార్ములావన్ కార్లు అంటే ఎంతో ఇష్టం. అంతేకాదు…తమ దేశానికి చెందిన ఫార్ములావన్ చాంపియన్ హామిల్టన్ అంటే మరీ మరీ ఇష్టం.

అయితే…ఐదేళ్ల హ్యారీకి వయసుకు మించిన రోగం వచ్చింది. బోన్ మ్యారో క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. తల్లిదండ్రులు సర్వశక్తులూ పోసి చికిత్స చేయిస్తున్నా…పిల్లాడు బతకటం కష్టమని డాక్టర్లు తేల్చి చెప్పారు.

అనుక్షణం మృత్యువుతో పోరాడుతున్న హ్యారీ షా సంగతి…ప్రపంచ చాంపియన్ హామిల్టన్ కు తెలిసింది. చావోబతుకో తెలియని ఆ చిన్నారి తన అభిమాని అన్న సంగతి తెలుసుకొని మరీ చలించిపోయాడు.

హ్యారీకే స్పానిష్ టైటిల్ అంకితం…

బార్సిలోనాలో కొద్దిరోజుల క్రితమే ముగిసిన స్పానిష్ గ్రాండ్ ప్రీ రేస్ లో… లూయి హామిల్టన్ విజేతగా నిలిచాడు. ఇప్పటికే ఐదుసార్లు ప్రపంచ టైటిల్ నెగ్గిన హామిల్టన్ ఆరో టైటిల్ కు గురిపెట్టాడు.

మృత్యువుతో పోరాడుతున్న హ్యారీ షాకు …తన స్పానిష్ గ్రాండ్ ప్రీ విజయాన్ని అంకితమిస్తున్నట్లు ప్రకటించాడు. అంతేకాదు… రేస్ ల్లో తాను ఉపయోగించే గ్లౌస్ తో పాటు… ఓ వీడియో సందేశాన్ని సైతం జత చేసి పంపాడు.

మెర్సిడెస్ కారు సైతం…

అంతేకాదు..హామిల్టన్ రేస్ ల కోసం ఉపయోగించిన మెర్సిడెస్ రేస్ కారును సైతం…హ్యారీ షా ఇంటిలోగిలిలో ఉంచి..టీమ్ మెర్సిడెస్ తన పెద్దమనసు చాటుకొంది. తాను కలనైనా ఊహించని విధంగా…తన ఇంటిముంగిట్లోకే హామిల్టన్ వాడిన ఫార్ములావన్ కారు రావడం చూసి…హ్యారీ షా పొంగిపోయాడు.

క్యాన్సర్ చికిత్సతో చిక్కిశల్యమైన హ్యారీ ముఖంలో చెప్పలేని సంతోషాన్ని చూసి…తల్లిదండ్రులు మురిసిపోయారు.

సరికొత్త శక్తి….

తాము నిరాశ,నిస్పృహల్లో ఉన్న తరుణంలో టీమ్ మెర్సిడెస్ యాజమాన్యం, హామిల్టన్ చూపిన కరుణ తమకు సరికొత్త శక్తిని, ఆశను ఇచ్చిందని హ్యారీ తండ్రి జేమ్స్ షా తెలిపారు.

ఏది ఏమైనా…చిన్నవయసులో పెద్ద కష్టం వచ్చిన హ్యారీ…మృత్యుపోరాటంలో విజేతగా నిలవాలన్ని కోరుకొందాం.

Tags:    
Advertisement

Similar News