జనసేన టీవీ కూడా అమ్ముడు పోయిందా...?
ఎన్నికలు ముగిశాయి. భ్రమలు తొలిగిపోయాయి. ఒక్కొక్కరుగా నేతలు జనసేన పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా ఆఫీసులు కూడా మూతపడ్డాయి. అనుబంధ సంస్థలను కూడా మూసివేశారు. తాజాగా ఇన్నాళ్ళూ ఆ పార్టీ తరపున వాయిస్ వినిపించిన 99 టీవీ కూడా చేతులు మారిందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 99 టీవీ అమ్ముడుపోయింది. తిరిగి వామపక్ష నేతల దగ్గరకు చేరినట్లు సమాచారం. సీపీఐ నారాయణ […]
ఎన్నికలు ముగిశాయి. భ్రమలు తొలిగిపోయాయి. ఒక్కొక్కరుగా నేతలు జనసేన పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు ముఖ్య నేతలు ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆ పార్టీ సోషల్ మీడియా ఆఫీసులు కూడా మూతపడ్డాయి. అనుబంధ సంస్థలను కూడా మూసివేశారు. తాజాగా ఇన్నాళ్ళూ ఆ పార్టీ తరపున వాయిస్ వినిపించిన 99 టీవీ కూడా చేతులు మారిందని అంటున్నారు.
విశ్వసనీయ సమాచారం ప్రకారం 99 టీవీ అమ్ముడుపోయింది. తిరిగి వామపక్ష నేతల దగ్గరకు చేరినట్లు సమాచారం. సీపీఐ నారాయణ 99 టీవీని 13 కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. త్వరలో వారి ఆధ్వర్యంలో ఎడిటోరియల్ బోర్డు పునర్ నిర్మాణం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు టీవీ చానళ్లను కొన్న ఓ బడా పారిశ్రామిక వేత్త ఆధ్వర్యంలో ఈ డీల్ నడిచినట్లు సమాచారం.
ఎన్నికలకు ముందు 99టీవీని జనసేన నేత, ఆదిత్య బిల్డర్స్ అధినేత తోట చంద్రశేఖర్ కొనుగోలు చేశారు. అప్పటి నుంచి పవన్ కల్యాణ్ ప్రచారానికి ఈ ఛానల్ ఉపయోగపడింది.
అయితే తాజాగా ఎన్నికలు ముగిశాయి. జనసేనకు అవసరం తీరిపోయింది. అధికారంలోకి రావడం లేదు. తమ పార్ట్‌నర్ కూడా తిరిగి గద్దెనెక్కే అవకాశం లేదని తెలిసింది. ఇంకేముంది ఒక్కోసంస్థను మూసివేస్తున్నారు.
ఎన్నికల ముందు టీవీ 99ని తోట చంద్రశేఖర్ 13 కోట్లకు కొనుగోలు చేశారు. ఇందులో ఏడు కోట్లను అప్పట్లో చెల్లించారట. మిగతా ఆరు కోట్లను ఇప్పటి వరకూ చెల్లించలేదని చెబుతున్నారు. దీంతో వామపక్ష నేతలు తిరిగి చానల్‌ను సొంతం చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఇందులో భాగంగా ఆయన ఇచ్చిన ఏడు కోట్లను తిరిగి ఇవ్వడమో లేక… జీతాల రూపంలో ఉద్యోగులకు చెల్లించడమో వంటి చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు.
జనసేన సోషల్‌మీడియా వ్యవహారాలను కూడా తోట చంద్రశేఖరే చూసుకునేవారని అంటున్నారు. ఆఖర్చును కూడా ఆయనే భరించేవారట. తాజాగా ఎన్నికలు ముగియడంతో వాటి అవసరం తీరిపోయింది. అందుకే జెండా ఎత్తేయడం మొదలెట్టారని చెబుతున్నారు. ఇప్పుడు టీవీని కూడా అమ్మేస్తున్నారు.
అయితే ఈ చానల్ ను కొన్నది ఒక్క సీపీఐ నారాయణేనా లేక ఇతరులు కూడా ఈ డీల్ లో ఉన్నారా అనే క్లారిటీ రావాల్సి ఉంది. మొత్తానికి ఈ ఛానల్ అయితే చేతులు మరిందని మాత్రం అంటున్నారు.