మోడీపై 'టైమ్' లో ఆర్టికల్ రాసిన జర్నలిస్టు 'వికీ పేజీ' ధ్వంసం..!

మోడీ ఒక ‘విచ్ఛిన్నకర శక్తి’ అని పేర్కొంటూ టైమ్ మ్యాగజైన్‌లో ఆర్టికల్ రాసిన జర్నలిస్టు, రచయిత ఆతిశ్ తసీర్ వికీపీడియా పేజీని బీజేపీ అనుకూల వ్యక్తులు నాశనం చేశారు. ఆర్టికల్ బయటకు వచ్చిన మరుసటి రోజు (10 మే) పలుమార్లు ఆయన పేజీని ఎడిట్ చేశారు. ఆ పేజీలో ఆతిశ్ తసీర్ ‘కాంగ్రెస్ పీఆర్ మేనేజర్’ అని జత చేశారు. మొదటిగా మే 10 రాత్రి 7.59 గంటల సమయంలో ఎడిట్ చేశారు. ఇలా పేజీలో అబద్దపు […]

Advertisement
Update:2019-05-12 02:54 IST

మోడీ ఒక ‘విచ్ఛిన్నకర శక్తి’ అని పేర్కొంటూ టైమ్ మ్యాగజైన్‌లో ఆర్టికల్ రాసిన జర్నలిస్టు, రచయిత ఆతిశ్ తసీర్ వికీపీడియా పేజీని బీజేపీ అనుకూల వ్యక్తులు నాశనం చేశారు. ఆర్టికల్ బయటకు వచ్చిన మరుసటి రోజు (10 మే) పలుమార్లు ఆయన పేజీని ఎడిట్ చేశారు.

ఆ పేజీలో ఆతిశ్ తసీర్ ‘కాంగ్రెస్ పీఆర్ మేనేజర్’ అని జత చేశారు. మొదటిగా మే 10 రాత్రి 7.59 గంటల సమయంలో ఎడిట్ చేశారు. ఇలా పేజీలో అబద్దపు సమాచారాన్ని జత చేసినట్లు ఆల్ట్ న్యూస్ పేర్కొంది. అయితే రాత్రి 8.30 గంటలకు పేజి తిరిగి పునరుద్దరించబడింది. కాని ఎడిట్ చేసిన సమాచారాన్ని స్క్రీన్ షాట్ తీసి బీజేపీ సోషల్ మీడియా వైరల్ చేసింది.

వికీపీడియా అన్‌ప్రొటెక్ట్ పేజీని ఎవరైనా ఎడిట్ చేయవచ్చు. దీంతో ఆతిశ్ తసీర్ పేజీని ఇష్టానుసారం ఎడిట్ చేశారు. దీనిపై ఆతిశ్ వికీకి కంప్లైంట్ చేయడంతో తిరిగి పునరుద్దరించి ప్రొటెక్టెడ్ పేజీగా మార్చారు.

గతంలో మోడీపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన వారిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం చూశాం. కానీ ఈ సారి మోడీకి వ్యతిరేకంగా వ్యాసం రాసినందుకు ఏకంగా వికీపీడియా పేజీలను కూడా మార్చేంత స్థాయికి బీజేపీ సోషల్ మీడియా వెళ్లిపోయింది.

కాగా, ప్రముఖ జర్నలిస్టు తవ్లీన్ సింగ్ కుమారుడే ఆతిశ్ తసీర్. ఆయన లండన్‌లో పుట్టి ఢిల్లీలో పెరిగారు.

Tags:    
Advertisement

Similar News