ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ అరుదైన రికార్డు

10 సీజన్లలో 8సార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు 2010, 2011 , 2018 సీజన్లలో విజేత గా చెన్నై 2008, 12, 13, 15 సీజన్లలో రన్నర్స్ అప్ గా చెన్నై 2019 టైటిల్ సమరంలో ముంబైతో చెన్నై ఢీ ఐపీఎల్ ఫైనల్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తహతహలాడుతోంది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే టైటిల్ సమరంలో మాజీ చాంపియన్ ముంబై […]

Advertisement
Update:2019-05-12 02:37 IST
  • 10 సీజన్లలో 8సార్లు ఫైనల్స్ చేరిన ఏకైకజట్టు
  • 2010, 2011 , 2018 సీజన్లలో విజేత గా చెన్నై
  • 2008, 12, 13, 15 సీజన్లలో రన్నర్స్ అప్ గా చెన్నై
  • 2019 టైటిల్ సమరంలో ముంబైతో చెన్నై ఢీ

ఐపీఎల్ ఫైనల్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించడానికి మహేంద్రసింగ్ ధోనీ నాయకత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్ తహతహలాడుతోంది.

హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఈరోజు జరిగే టైటిల్ సమరంలో మాజీ చాంపియన్ ముంబై ఇండియన్స్ తో అమీతుమీ తేల్చుకోనుంది.

తిరుగులేని రికార్డు….

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న చెన్నై కి ఎనిమిదిసార్లు ఫైనల్స్ చేరడమే కాదు…మూడుసార్లు టైటిల్ నెగ్గిన అరుదైన రికార్డు సైతం ఉంది.

ప్రస్తుత సీజన్ రెండు క్వాలిఫైయర్స్ మ్యాచ్ ల్లోనూ ఆడి 1-1 రికార్డుతో టైటిల్ సమరానికి అర్హత సంపాదించింది. విశాఖ వేదికగా ముగిసిన రెండో క్వాలిఫైయర్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను అలవోకగా ఓడించడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.

పడిలేచిన కెరటం…

బెట్టింగ్, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో రెండేళ్ల నిషేధం శిక్ష తర్వాత….ఐపీఎల్ 11వ సీజన్ బరిలోకి దిగిన మాజీ చాంపియన్
చెన్నై సూపర్ కింగ్స్.. పడిలేచిన కెరటంలా దూసుకొచ్చింది.

56 మ్యాచ్ ల డబుల్ రౌండ్ రాబిన్ లీగ్… రెండోస్థానంలో నిలవడం ద్వారా ప్లే ఆఫ్ రౌండ్స్ కు అర్హత సాధించిన చెన్నై….ముంబై తో హోంగ్రౌండ్ చెపాక్ స్టేడియం వేదికగా ముగిసిన తొలి క్వాలిఫైయర్ సమరంలో విఫలమయ్యింది.

అయినా…రెండో క్వాలిఫైయర్స్ లో విజయంతో టైటిల్ రౌండ్ కు అర్హత సంపాదించింది.

ఎవర్ గ్రీన్ మహేంద్రసింగ్ ధోనీ…

రెండేళ్ల విరామం తర్వాత… వరుసగా రెండో ఐపీఎల్ టైటిల్ వేటకు దిగిన చెన్నై ..డూప్లెసి, వాట్సన్, డ్వయన్ బ్రావో, రాయుడు, హర్భజన్ సింగ్ ఇమ్రాన్ తాహీర్, రవీంద్ర జడేజా లాంటి అపారఅనుభవం ఉన్న ఆటగాళ్లతో టైటిల్ కు గురిపెట్టింది. మరోసారి హాట్ ఫేవరెట్ గా సమరానికి సిద్ధమయ్యింది.

10 సీజన్లు- 8 ఫైనల్స్, 3 టైటిల్స్…

2008 ప్రారంభసీజన్ నుంచి ఐపీఎల్ లో పాల్గొంటూ వస్తున్న చెన్నైకి …గతంలో ఏడుసార్లు ఫైనల్స్ ఆడిన అనుభవం ఉంది. 2008, 2010, 2011, 2012, 2013, 2015, 18, 19 సీజన్లలో ఫైనల్స్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్…2010, 2011, 2018 సీజన్లలో మాత్రమే విజేతగా నిలిచింది.

మొత్తం 8 ఫైనల్స్ లో నాలుగుసార్లు రన్నర్స్ అప్ స్థానాలతో చెన్నై సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

హైదరాబాద్ రాజీవ్ స్టేడియంలో ఈరోజు జరిగే ఫైనల్స్ లో ముంబై ఇండియన్స్ పై …చెన్నై సూపర్ కింగ్స్ ప్రతీకారం తీర్చుకొని నాలుగోసారి టైటిల్ అందుకొంటుందా…వేచిచూడాల్సిందే.

Tags:    
Advertisement

Similar News