జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం వెనుక ఎస్బీఐ, ఎతిహాద్..?

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ఎయిర్‌లైన్స్‌గా పేరుగాంచిన జెట్ ఎయిర్‌వేస్‌ను కావాలనే కుట్ర పూరితంగా సంక్షోభంలోనికి నెట్టారా..? జెట్‌లో అతి తక్కువ ధరకే మరింత వాటా తీసుకోవడానికి పార్టనర్ కంపెనీ పావులు కదిపిందా? అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం వెనుక దాని భాగస్వామైన ఎతిహాద్ ఎయిర్‌వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు జెట్ పైలెట్లు ప్రధాని నరేంద్ర మోడీకి పిర్యాదు చేశారు. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ స్టాక్ మార్కెట్లో […]

Advertisement
Update:2019-05-03 06:25 IST

దేశంలో అతిపెద్ద ప్రైవేటు రంగ ఎయిర్‌లైన్స్‌గా పేరుగాంచిన జెట్ ఎయిర్‌వేస్‌ను కావాలనే కుట్ర పూరితంగా సంక్షోభంలోనికి నెట్టారా..? జెట్‌లో అతి తక్కువ ధరకే మరింత వాటా తీసుకోవడానికి పార్టనర్ కంపెనీ పావులు కదిపిందా? అంటే అవుననే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

జెట్ ఎయిర్‌వేస్ సంక్షోభం వెనుక దాని భాగస్వామైన ఎతిహాద్ ఎయిర్‌వేస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉన్నట్లు జెట్ పైలెట్లు ప్రధాని నరేంద్ర మోడీకి పిర్యాదు చేశారు. కంపెనీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్ ఎయిర్‌వేస్ స్టాక్ మార్కెట్లో జెట్ షేరును కుప్పకూల్చడం ద్వారా మరో 25 శాతం వాటాను చేజిక్కించుకోవాలని అనుకుందని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే 24 శాతం వాటా ఉన్న ఎతిహాద్ తన వాటాను 49 శాతానికి పెంచుకోవాలనుకుందని అన్నారు.

మరోవైపు, కంపెనీ ప్రమోటర్ అయిన నరేష్ గోయల్ తన వాటాను తనఖా పెట్టి 1500 కోట్ల రూపాయల నిధులను సేకరించడానికి సిద్దపడినా…. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముందుకు రాలేదని పైలెట్లు ఆరోపిస్తున్నారు. కావాలనే ఎతిహాద్, ఎస్బీఐ కలిసి జెట్‌ను సంక్షోభంలోనికి నెట్టాయని వారంటున్నారు. ఎతిహాద్ పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రధానికి చేసిన పిర్యాదులో వారు పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News