ఆయన ప్రభుత్వం కోసం పనిచేస్తున్నాడు.... టీడీపీ కోసం కాదు.... అదే వీళ్ళ బాధ

ఒక పథకం ప్రకారమే చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను టార్గెట్‌ చేస్తున్నారని…. చీఫ్‌ సెక్రటరీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతియ్యడానికే ఇలా వరుసగా ఆరోపణలు చేస్తున్నారని… ఇది తప్పని తెలిసినా మీడియా చంద్రబాబుకు వంతపాడుతూ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను బదనాం చేస్తున్నదని…. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఏం ఉపయోగమో అర్థం కావడం లేదన్నారు మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు. సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నాయకులు, మీడియా […]

Advertisement
Update:2019-04-26 11:37 IST

ఒక పథకం ప్రకారమే చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను టార్గెట్‌ చేస్తున్నారని…. చీఫ్‌ సెక్రటరీ మానసిక స్థైర్యాన్ని దెబ్బతియ్యడానికే ఇలా వరుసగా ఆరోపణలు చేస్తున్నారని… ఇది తప్పని తెలిసినా మీడియా చంద్రబాబుకు వంతపాడుతూ చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను బదనాం చేస్తున్నదని…. ఇలా చేయడం వల్ల వాళ్ళకు ఏం ఉపయోగమో అర్థం కావడం లేదన్నారు మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు.

సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను టార్గెట్‌ చేస్తూ టీడీపీ నాయకులు, మీడియా వరుసగా చేస్తున్న ఆరోపణలపై…. ఆంధ్రప్రదేశ్‌ మాజీ సీఎస్‌ ఐవైఆర్‌ కృష్ణా రావు ఒక టీవీ చానల్‌ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.

ప్రస్తుత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం ను నియమించింది ఎలక్షన్‌ కమిషనేనని, ఎన్నికల కోడ్‌ అమలులో ఉండగా సీఎస్‌ ఎలక్షన్‌ కమిషన్‌ పరిధిలోనే పనిచేయాలి తప్ప ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేయడని, మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ అదే చెబుతుందన్నారు. ఆ పరిధిలోనే ప్రస్తుత సీఎస్‌ చక్కగా పనిచేస్తున్నారన్నారు.

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను చీఫ్‌ సెక్రటరీ బాగా అమలు చేస్తున్నాడని…. ఆ మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను మార్చమని చంద్రబాబు కోర్టులనో, ఎలక్షన్‌ కమిషన్‌నో అడగొచ్చు గానీ ఉన్న మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను చీఫ్‌ సెక్రటరీ అమలు చేయవద్దని ఎలా ప్రశ్నించగలడన్నారు.

అబద్దాన్ని నిజంగా ప్రచారం చేయడంలో చంద్రబాబుకు ఎవరూ సాటి లేరని… అందుకు ఆయనకు సహాయం చేయడానికి మీడియా కూడా ఉందన్నారు ఐవైఆర్‌ కృష్ణా రావు.

చీఫ్‌ సెక్రటరీ నిర్వహించే సమీక్షా సమావేశాలకు ముఖ్యమంత్రిని పిలవలేదని కొన్ని మీడియా సంస్థలు ఎత్తి చూపుతున్నాయని…. ఇంతకన్నా హాస్యాస్పదం మరొకటి ఉండదన్నారు. ఎందుకంటే ఆపద్ధర్మ ముఖ్యమంత్రి సమీక్షా సమావేశాలు నిర్వహించకూడదు… అలాంటిది సమీక్షా సమావేశాలకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిని చీఫ్‌ సెక్రటరీ ఎలా ఆహ్వానిస్తారు? అని ప్రశ్నించారాయన.

రేపు ఓట్ల లెక్కింపులో ఎవైనా లోటు పాట్లు తలెత్తితే చీఫ్‌ సెక్రటరీని కూడా ఎలక్షన్‌ కమిషన్‌ వివరణ అడుగుతుందని… ఎన్నికల కమిషన్‌ సలహామేరకు ఎన్నికల విధులు నిర్వహించే బాధ్యత చీఫ్‌ సెక్రటరీకి ఉందన్నారు. అలాంటప్పుడు చీఫ్‌ సెక్రటరీ అధికారులతో ఈ విషయంలో సమీక్షా సమావేశాలు నిర్వహించకుండా ఎలా ఉంటాడని ఆయన ప్రశ్నించాడు.

మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కండక్ట్‌ ను అమలు చేయాల్సిన బాధ్యత సీఎస్‌ పై ఉందని, ఒక ముఖ్యమంత్రి తీసుకోవాల్సిన నిర్ణయాన్ని ఈ సమయంలో సీఎస్‌ తీసుకుంటాడని, ఏమైనా సందేహాలొస్తే కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి ఆ విషయాన్ని తీసుకెళ్తారన్నారు.

నిధులు తక్కువగా ఉండి చెల్లింపులు ఎక్కువగా ఉంటే… ఆ బిల్లులలో మొదట ఏ బిల్లును క్లియర్‌ చేయాలో నిర్ణయం తీసుకునే అధికారం సాధారణ పరిస్థితుల్లో ముఖ్యమంత్రికి ఉంటుందని…. కానీ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఆ అధికారం సీఎస్‌ కు ఉంటుందని…. ఆపనినే సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం చేస్తున్నారన్నారు.

ఈ విషయం తెలిసి కూడా తాము కోరుకున్న బిల్లులు క్లియర్‌ చేయలేదని ఒక సీఎస్‌ ను బదనాం చేస్తూ….. అసాధారణ స్థాయిలో ఇలా ఎందుకు ఆరోపణలు చేస్తున్నారో అర్థం కావడంలేదన్నారు. చంద్రబాబుకు నచ్చినా నచ్చకపోయినా ఈ నెలరోజులు సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యమే ఉంటారన్నారు.

చీఫ్‌ మినిస్టర్‌కు పంపాల్సిన ఫైళ్ళను సీఎస్‌ పంపిస్తూనే ఉన్నాడని…. ఉదాహరణకు డీజీ వెంకటేశర్వర రావు విషయంలో చంద్రబాబు నిర్ణయాన్నే చీఫ్‌ సెక్రటరీ అమలు చేశాడని, చీఫ్‌ సెక్రటరీ నిబంధనలను ఎక్కడా అతిక్రమించడం లేదన్నారు. చీఫ్‌ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యంకు నియమ నిబంధనలమీద మంచి అవగాహన ఉందని, మంచి నిర్ణయాలే తీసుకుంటున్నాడని…. నియమ నిబంధనల ప్రకారం పనిచేస్తూ…. వీళ్ళు కోరుకున్న విధంగా ఆయన పనిచేయడం లేదు కాబట్టే ఆయనను టార్గెట్‌ చేసి ఒక పథకం ప్రకారం ఆయనపై బురద చల్లుతున్నారని ఐవైఆర్‌ కృష్ణారావు అభిప్రాయపడ్డారు.

Tags:    
Advertisement

Similar News