జలియన్ వాలాబాగ్ మారణకాండకు వందేళ్ళు

ఏప్రిల్ 13…. ఇదో చీకటి రోజు.. మన దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం గొంతెత్తిన ప్రజలపై తుపాకీ గుళ్లు వర్షించిన రోజు.  బాగ్ అంటే ఒక తోట.. ఒక పచ్చని ప్రదేశం.. ఒక అందమైన ఆహ్లాదకరమైన చోటు. కాని అలాంటి చోటునే రక్తసిక్తంగా మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. స్వేఛ్చా స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న వందలాది మంది భారతీయులను అకారణంగా పొట్టన పెట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం. ఉమ్మడి పంజాబ్‌లో (అప్పటికి పాకిస్తాన్ విడిపోలేదు) ఒక పండుగ కోసం సిక్కులందరూ […]

Advertisement
Update:2019-04-13 05:02 IST

ఏప్రిల్ 13…. ఇదో చీకటి రోజు.. మన దేశపు స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం గొంతెత్తిన ప్రజలపై తుపాకీ గుళ్లు వర్షించిన రోజు.

బాగ్ అంటే ఒక తోట.. ఒక పచ్చని ప్రదేశం.. ఒక అందమైన ఆహ్లాదకరమైన చోటు. కాని అలాంటి చోటునే రక్తసిక్తంగా మార్చేసింది బ్రిటిష్ ప్రభుత్వం. స్వేఛ్చా స్వాతంత్య్రాల కోసం పోరాడుతున్న వందలాది మంది భారతీయులను అకారణంగా పొట్టన పెట్టుకుంది బ్రిటిష్ ప్రభుత్వం.

ఉమ్మడి పంజాబ్‌లో (అప్పటికి పాకిస్తాన్ విడిపోలేదు) ఒక పండుగ కోసం సిక్కులందరూ ఒక చోట చేరితే.. అది సహించలేని కర్కసుడైన డయ్యర్ అనే ఒక బ్రిటిష్ నరహంతకుడు భారతీయులపై తుపాకీ గుళ్ల వర్షం కురిపించి వందలాది మందిని పొట్టన పెట్టుకున్నాడు. ఆ రోజు అసలు ఏం జరిగిందో వెనక్కి వెళ్లి చూద్దాం..

అమృత్‌సర్‌లోని గోల్డెన్‌టెంపుల్‌ (స్వర్ణదేవాలయం)కి దగ్గరలో జలియన్ వాలాబాగ్ ఉంటుంది. ప్రతీ ఏడాది లాగానే ఆ రోజు సిక్కుల కొత్త ఏడాది సంబరాల కోసం వేలాది మంది అక్కడకు చేరుకున్నారు. అయితే ఈ సారి కేవలం కొత్త ఏడాది సంబరాలకోసమే కాక స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని బ్రిటిషు వారి చెరలో ఉన్న సత్యపాల్, డాక్టర్ సయీఫుద్దీన్ ల విడుదల కోసం ఆందోళన చేపట్టారు. వారి అరెస్టును నిరసిస్తూ వేలాది మంది ఆందోళనకు దిగారు.

ఈ విషయం తెలుసుకున్న బ్రిటిష్ సైనికులు జలియన్ వాలా బాగ్‌కు చేరుకున్నారు. అప్పుడే చరిత్రలోనే అత్యంత ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. జనరల్ డయ్యర్ ఇచ్చిన ఆదేశాల మేరకు అక్కడ చేరుకున్న నిరాయుధులైన సామాన్య ప్రజల మీద బ్రిటిష్ సైనికులు నిర్ధాక్షిణ్యంగా కాల్పులకు తెగబడ్డారు. ఆ పార్కుకు ఉన్న ఒకే ద్వారం వద్ద మెషిన్ గన్‌ను ఉంచడంతో ప్రజలకు ఎటు పోవాలో కూడా అర్థం కాలేదు. దీంతో చాలా మంది ప్రాణాలు రక్షించుకోవడానికి అక్కడ ఉన్న బావిలో దూకారు.

ఈ ఘటన జరిగి నేటికి వందేళ్లు గడిచింది. కాని ఇప్పటికీ బ్రిటన్ భారతీయులకు ఎలాంటి క్షమాపణ చెప్పలేదు. మూడు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 10న బ్రిటన్ పార్లమెంటులో ప్రధాని థెరిసా మే మాట్లాడుతూ.. 1919లో బ్రిటిష్ ఇండియాలో జరిగిన జలియన్ వాలాబాగ్ ఘటన చరిత్రలో ఒక మచ్చలా మిగిలిపోయింది.

ఇది భారతీయ చరిత్రలో ఒక విషాదకరమైన ఘటన’ అని మాత్రమే అభివర్ణించారు.

థెరిసా మే ఈ ప్రకటన చేయడానికి కూడా కారణం కేరళకు చెందిన శశిథరూర్ మరో ఎంపీ ఇంగ్లాండ్‌ను ఈ ఘటనపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడమే. ఈ ఘటన ఆ తర్వాతే బ్రిటిష్ ఇండియాలో కలోనియల్ రూల్ అంతానికి కారణమైంది.

Tags:    
Advertisement

Similar News