పోలింగ్ కేంద్రంలో వేటకొడవళ్లతో దాడి.. వైసీపీ, టీడీపీ కార్యకర్తలు మృతి

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాయలసీమలో రక్తపాతం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలోని పోలింగ్ బూత్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఒకరిపై ఒకరు వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన పుల్లారెడ్డి, టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించడానికి […]

Advertisement
Update:2019-04-11 07:11 IST

ఏపీ అసెంబ్లీ ఎన్నికల వేళ రాయలసీమలో రక్తపాతం జరిగింది. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వీరాపురంలోని పోలింగ్ బూత్‌లో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలో ఒకరిపై ఒకరు వేటకొడవళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో వైసీపీకి చెందిన పుల్లారెడ్డి, టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

పోలింగ్ జరుగుతున్న సరళిని పరిశీలించడానికి ఇరు వర్గాలు చేరుకున్నాయి. ఈ సమయంలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. విషయం తెలుసుకొని పోలీసు అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఇరు వర్గాలను అదుపులోనికి తీసుకున్నారు. ముందస్తు జాగ్రత్తగా భారీ బలగాలను ఆ ప్రాంతానికి పంపించారు.

Tags:    
Advertisement

Similar News