కేసీఆర్ పెద్ద మనసు ఎవరి కోసం పవనూ ?

“ఆంధ్ర రాజకీయాల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్ద మనసు చేసుకోవాలి. అక్కడి రాజకీయాలలో ఆయన వేలు పెట్టొద్దు” ఈ మాటలు అన్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో…. వివిధ ప్రచార సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా తెలంగాణ ముఖ్యమంత్రిని పెద్ద మనసు చేసుకోవాలంటూ అభ్యర్థించడం తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల […]

Advertisement
Update:2019-04-08 04:21 IST

“ఆంధ్ర రాజకీయాల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్ద మనసు చేసుకోవాలి. అక్కడి రాజకీయాలలో ఆయన వేలు పెట్టొద్దు” ఈ మాటలు అన్నది జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో…. వివిధ ప్రచార సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ అక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీని విమర్శించకుండా తెలంగాణ ముఖ్యమంత్రిని పెద్ద మనసు చేసుకోవాలంటూ అభ్యర్థించడం తెలుగు ప్రజలను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పెద్దమనసు చేసుకోవాలని చెప్పిన పవన్ కళ్యాణ్ … తాను ఎవరికి పెద్ద మనసుతో సాయం చేస్తున్నారో ప్రకటించాలని తెలుగు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ ఎన్నికలు జరిగినా అధికార పార్టీ చేసిన అవినీతి, ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై మాట్లాడాల్సి ఉండగా…. పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచార సభల్లో పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రసంగాలు అధికార తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే ఉన్నాయని విమర్శలు వస్తున్నాయి. ఎన్నికలకు నోటిఫికేషన్ ప్రకటించక ముందు తెలుగుదేశం పార్టీ పైనా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, లోకేష్ పైనా కొన్నాళ్ల పాటు నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా మాత్రం చంద్రబాబు నాయుడిని వెనకేసుకొస్తున్నారు అని అంటున్నారు. దీనికి కారణం వారిద్దరి మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరింది అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన మంత్రులు గానీ, సీనియర్ నాయకులు గానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదని, అలాంటప్పుడు కెసిఆర్ పెద్దమనసు చేసుకొని ఎవరికి ఉపయోగ పడాలి? అని ప్రశ్నిస్తున్నారు.

“తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్ద మనసు చేసుకోవడం అంటే పవన్ కళ్యాణ్ దృష్టిలో తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకడమా?” అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నిలదీస్తున్నారు.

రాజకీయ పార్టీగా ఎన్నికల బరిలో నిలిచిన పవన్ కళ్యాణ్ కి అధికార పార్టీకి మద్దతు పలకండి అని చెప్పే ధైర్యం లేక “పెద్ద మనసు చేసుకోండి. ఏపీ రాజకీయాలలో వేలు పెట్టకండి” అంటూ హితబోధలు చేయడం చంద్రబాబు నాయుడు ప్రాపకం కోసం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

ఇక పెద్ద మనసు మాటలు కట్టిపెట్టి ఎన్నికల్లో పోటీ చేస్తున్నజనసేన అభ్యర్ధుల విజయం కోసం పాటు పడితే మంచిదని హితబోధ చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News