జగన్ లెక్క ఇదీ...
ఈసారి ఎన్నికల్లో తాము స్వీప్ చేయబోతున్నామని చెప్పారు వైఎస్ జగన్. టైమ్స్ నౌ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మాకు మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం చాలా తక్కువని… తమకు 44.50 శాతం ఓట్లు వస్తే టీడీపీకి 45.50 శాతం ఓట్లు వచ్చాయన్నారు. అప్పట్లో మోడీ, పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వెంట వారు కూడా లేరని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుకు […]
ఈసారి ఎన్నికల్లో తాము స్వీప్ చేయబోతున్నామని చెప్పారు వైఎస్ జగన్. టైమ్స్ నౌ చానల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన… పలు అంశాలపై స్పందించారు.
చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర ప్రజావ్యతిరేకత ఉందన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీకి మాకు మధ్య ఓట్ల శాతంలో వ్యత్యాసం చాలా తక్కువని… తమకు 44.50 శాతం ఓట్లు వస్తే టీడీపీకి 45.50 శాతం ఓట్లు వచ్చాయన్నారు.
అప్పట్లో మోడీ, పవన్ కల్యాణ్ కూడా చంద్రబాబుతో ఉన్నారని చెప్పారు. కానీ ఇప్పుడు చంద్రబాబు వెంట వారు కూడా లేరని వ్యాఖ్యానించారు. 2014లో చంద్రబాబుకు అనుకూలంగా అన్నీ జరిగినా తక్కువ ఓట్లతోనే తాము ఓడిపోయామన్నారు. ఈసారి మాత్రం టీడీపీకి వైసీపీకి మధ్య ఓట్ల వ్యత్యాసం భారీగా ఉంటుందని జగన్ ధీమా వ్యక్తం చేశారు. ఏపీకి మోదీ, కాంగ్రెస్ ఇద్దరూ మోసం చేశారని కచ్చితంగా చెబుతున్నానన్నారు.
తనను అక్రమంగా జైల్లో పెట్టారని…. దోషిగా రుజువుకానంత వరకు గరిష్టంగా 3 నెలల్లో బెయిల్ ఇవ్వాలని చట్టం చెబుతున్నా… తనను మాత్రం 16 నెలల పాటు జైలులో ఉంచారని గుర్తు చేశారు. ఆ సమయంలో తన కుటుంబం ఎంతో
వేదనకు గురైందన్నారు. తన ఇద్దరు పిల్లలు స్కూల్‌కు వెళ్లే వారని… వారు కూడా అక్కడ ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్నారు.
ఈ తొమ్మిదేళ్లలో తాను, తన కుటుంబం అన్ని రకాల వేధింపులకు గురయ్యామన్నారు. కానీ వాటిని తాను మనసులో పెట్టుకోలేదన్నారు. తాను వ్యక్తిగతంగా బాధపడాల్సిన దాని కంటే… ప్రజలకు ఉన్న ఇబ్బందులే తనకు ఎక్కువగా బాధ కలిగిస్తున్నాయన్నారు.
ప్రజల సమస్యలను తీర్చేందుకు తాను పనిచేస్తానని… అదే తనకు ముఖ్యమన్నారు. తనకు ఎవరి మీదా పగగానీ, కక్ష గానీ లేదన్నారు. అన్నింటిని దేవుడికే వదిలేస్తానన్నారు.