బ్రాహ్మణ ద్వేషి చంద్రబాబు

నేను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ నాకు కులపిచ్చి లేదు. కులాల మీద నమ్మకమూ లేదు. అందుకే నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నా కూతురుకు వర్ణాంతర వివాహం చేశాను. నాకు కులాభిమానం లేదని చెప్పడానికే ఇదంతా…. అని సినీ రచయిత కోన వెంకట్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ఒక్క బ్రహ్మణుడికి కూడా సీటు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లోనూ ఒక్క బ్రాహ్మణుడికి సీటు ఇవ్వలేదు అన్నారు కోన […]

Advertisement
Update:2019-03-25 07:54 IST

నేను సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాను. కానీ నాకు కులపిచ్చి లేదు. కులాల మీద నమ్మకమూ లేదు. అందుకే నేను కులాంతర వివాహం చేసుకున్నాను. నా కూతురుకు వర్ణాంతర వివాహం చేశాను. నాకు కులాభిమానం లేదని చెప్పడానికే ఇదంతా…. అని సినీ రచయిత కోన వెంకట్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి. గత ఎన్నికల్లోనూ చంద్రబాబు ఒక్క బ్రహ్మణుడికి కూడా సీటు ఇవ్వలేదు. ఈ ఎన్నికల్లోనూ ఒక్క బ్రాహ్మణుడికి సీటు ఇవ్వలేదు అన్నారు కోన వెంకట్‌.

అదే జగన్‌ వైసీపీ తరపున నలుగురు బ్రాహ్మణులకు సీట్లు ఇచ్చాడు. అదీ ముఖ్యంగా విశాఖపట్నం, విజయవాడ, బాపట్ల…. లాంటి ప్రధాన నియోజక వర్గాల్లో.

చంద్రబాబు బ్రాహ్మణ ద్వేషి. ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్రాహ్మణులు పనికిరారని చంద్రబాబు నమ్మకం. అందుకే ఆయన పార్టీలో ఎప్పుడూ బ్రాహ్మణులకు సముచిత స్థానం లేదు. గాయత్రీ మంత్రం చదివే ఏ బ్రాహ్మణుడూ చంద్రబాబుకు ఓటేయ్యకూడదని కోన వెంకట్‌ పిలుపునిచ్చారు.

చంద్రబాబుకు బ్రాహ్మణుల ఓట్లు కావాలి. కానీ వాళ్ళకు సీట్లు ఇవ్వడు. అందుకే ఏ బ్రాహ్మణుడూ చంద్రబాబుకు ఓటు వెయ్యవద్దని సాటి బ్రాహ్మణులందరినీ కోరుతున్నాను అని అన్నారాయన.

Tags:    
Advertisement

Similar News