చంద్రబాబు చాలా టెన్షన్ పడుతున్నారు " రాయపాటి
తమ టికెట్ల విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే సమర్ధుడు ఉంటే చూపించి టికెట్ ఇవ్వాలని కోరానన్నారు. కానీ చంద్రబాబు ఏదీ తేల్చడం లేదన్నారు. చంద్రబాబు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు. ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశం అయ్యామని… ఎంపీ టికెట్ ఓకే అన్నారని… ఆతర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా కోరామన్నారు. కానీ ఇప్పుడు రెండు సీట్ల విషయంలోనూ మరికొంత టైం ఇవ్వాలంటున్నారని రాయపాటి చెప్పారు. ఎటూ తేల్చడం లేదన్నారు. తన […]
తమ టికెట్ల విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చడం లేదని ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కంటే సమర్ధుడు ఉంటే చూపించి టికెట్ ఇవ్వాలని కోరానన్నారు. కానీ చంద్రబాబు ఏదీ తేల్చడం లేదన్నారు. చంద్రబాబు ఉద్దేశం ఏంటో అర్థం కావడం లేదన్నారు.
ఇప్పటి వరకు మూడుసార్లు సమావేశం అయ్యామని… ఎంపీ టికెట్ ఓకే అన్నారని… ఆతర్వాత ఎమ్మెల్యే టికెట్ కూడా కోరామన్నారు.
కానీ ఇప్పుడు రెండు సీట్ల విషయంలోనూ మరికొంత టైం ఇవ్వాలంటున్నారని రాయపాటి చెప్పారు. ఎటూ తేల్చడం లేదన్నారు. తన కంటే మంచి అభ్యర్థులు ఎవరున్నారని రాయపాటి ప్రశ్నించారు.
గుంటూరు జిల్లాలో తమతో పరిచయం లేని వారు లేరన్నారు. టికెట్ ఇచ్చేది… లేదు… అని చెప్పకుండా ఆలోచిస్తాం అంటూ చంద్రబాబు టెక్నికల్ పదాలను వాడుతున్నారని రాయపాటి చెప్పారు.
సత్తెనపల్లి టికెట్ విషయంలో కోడెల గట్టిగా పట్టుపడుతున్నారని… అయితే తాను బ్లాక్‌మెయిల్ చేసే వ్యక్తిని కాదన్నారు. స్పీకర్‌తో చంద్రబాబుకు ఏం అవసరం ఉందో తెలియడం లేదన్నారు. ఒకవేళ తనకు ఎంపీ టికెట్ ఇవ్వకుండా కొత్తవారిని తెరపైకి తెస్తే అప్పుడు ఆలోచిస్తానన్నారు.
చంద్రబాబు మాత్రం బాగా టెన్షన్ పడుతున్నారని రాయపాటి చెప్పారు. చంద్రబాబు తనకు అన్యాయం చేయరని ఇప్పటికీ నమ్ముతున్నానని… ఒకవేళ టికెట్ ఇవ్వకపోతే అప్పుడు ఏం చేయాలన్నది ఆలోచిస్తానన్నారు.
ఇతర పార్టీల నుంచి ఆఫర్లు ఏమైనా ఉన్నాయా అని ప్రశ్నించగా… అవన్నీ తనకు తెలియవని…తన సోదరుడు శ్రీనివాస్, కుమారుడు రంగారావు చూస్తున్నారని రాయపాటి సమాధానం చెప్పారు.