నాగ్‌పూర్‌లో ఆసీస్‌పై ఓటమి లేని టీం ఇండియా

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్ హాట్ ఫేవరెట్ గా విరాట్ కొహ్లీ సేన ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్‌లోని రెండో వన్డేలో సైతం విజయానికి హాట్ ఫేవరెట్‌గా టీమిండియా ఉరకలేస్తోంది. హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో సాధించిన విజయంతో… నాగపూర్ వేదికగా జరిగే రెండో వన్డేలో సైతం విజయానికి గురిపెట్టింది. అంతేకాదు… నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా… కంగారూ టీమ్‌తో ఆడిన మూడుకు మూడు మ్యాచ్‌లూ నెగ్గిన రికార్డు టీమిండియాకు ఉంది.   వీసీఎం […]

Advertisement
Update:2019-03-05 08:10 IST
  • టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆసీస్
  • హాట్ ఫేవరెట్ గా విరాట్ కొహ్లీ సేన

ఆస్ట్రేలియాతో పాంచ్ పటాకా సిరీస్‌లోని రెండో వన్డేలో సైతం విజయానికి హాట్ ఫేవరెట్‌గా టీమిండియా ఉరకలేస్తోంది. హైదరాబాద్ వేదికగా ముగిసిన తొలివన్డేలో సాధించిన విజయంతో…
నాగపూర్ వేదికగా జరిగే రెండో వన్డేలో సైతం విజయానికి గురిపెట్టింది. అంతేకాదు… నాగపూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా… కంగారూ టీమ్‌తో ఆడిన మూడుకు మూడు మ్యాచ్‌లూ
నెగ్గిన రికార్డు టీమిండియాకు ఉంది.

 

వీసీఎం స్టేడియం వేదికగా 2009 అక్టోబర్ 28 తొలిసారిగా ఆసీస్‌తో తలపడిన టీమిండియా 99 పరుగుల భారీవిజయంతో బోణీ కొట్టింది. కెప్టెన్ ధోనీ 107 బాల్స్‌లోనే 124 పరుగులతో మ్యాచ్ విన్నర్‌గా నిలిచాడు. ఆ తర్వాత 2013 సిరీస్‌లో భాగంగా జరిగిన ఆరవ వన్డే మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల విజయం నమోదు చేసింది.

2017 సిరీస్‌లోనే ఐదోవన్డేలో సైతం…ఆరెంజ్ సిటీ వేదికగానే రెండుజట్లూ తలపడ్డాయి. ఏకపక్షంగా సాగిన ఈ పోరులో టీమిండియా 7 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది. మొత్తం మీద నాగపూర్ వీసిఏ స్టేడియం వేదికగా టీమిండియా ఆడిన మూడుకు మూడు మ్యాచ్ ల్లోనూ అజేయంగా నిలవడం విశేషం. ప్రస్తుత 2019 సిరీస్ లోని రెండో వన్డేలో సైతం నెగ్గడం ద్వారా 4-0 రికార్డు సాధించాలన్న పట్టుదలతో విరాట్ కొహ్లీ అండ్ కో ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News