మేనకా గాంధీకి చిన్మయి ట్వీట్.... వైరముత్తు వ్యవహారం ఎన్‌సీడబ్ల్యూకి అప్పగింత
పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, లైంగిక వేధింపులపై ప్రపంచ వ్యాప్తంగా #MeToo అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. దక్షిణాదిన, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో జరుగుతున్న ఇలాంటి లైంగిక వేధింపుల వ్యవహారాన్ని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా వెలుగులోనికి తెచ్చింది. తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయితగా ఉన్న వైరముత్తు తనను 18 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో […]
పని ప్రదేశాల్లో మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులు, లైంగిక వేధింపులపై ప్రపంచ వ్యాప్తంగా #MeToo అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగిన విషయం తెలిసిందే. దక్షిణాదిన, ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమలో జరుగుతున్న ఇలాంటి లైంగిక వేధింపుల వ్యవహారాన్ని ప్రముఖ గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద కూడా వెలుగులోనికి తెచ్చింది.
తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖ రచయితగా ఉన్న వైరముత్తు తనను 18 ఏండ్ల వయస్సు ఉన్నప్పుడు లైంగికంగా వేధించడం, అసభ్యంగా ప్రవర్తించడంతో తాను ఎంతో మానసిక క్షోభ అనుభవించానంటూ ఆమె సోషల్ మీడియాలో బెయటపెట్టింది. దీంతో ఆమెపై పరోక్షంగా వేధింపులు మొదలయ్యాయి. తమిళ డబ్బింగ్ అసోసియేషన్ నుంచి ఆమె సభ్యత్వాన్ని తొలగించారు. ఈ వ్యవహారంపై ఆమె కేంద్ర మహిళా, శిశు సంక్షేమ మంత్రి మేనకా గాంధీకి పలు సార్లు ట్వీట్ చేశారు.
@Manekagandhibjp @NCWIndia
Maam, it’s been 4 months since I named Mr Vairamuthu as my predator. I have since then been banned from work in the TN Film Industry (Dubbjng Union).
The law as of today doesn’t allow me to file a case.
Please give me a solution @PMOIndia— Chinmayi Sripaada (@Chinmayi) February 27, 2019
తాజాగా ఇవాళ చిన్మయి చేసిన ట్వీట్ చూసి మేనక స్పందించారు. ఈ వ్యవహారాన్ని జాతీయ మహిళా కమిషన్‌కు బదిలీ చేస్తున్నానని.. వాళ్లే దీనిపై చర్య తీసుకుంటారని మేనక బదులిచ్చారు. చిన్మయి వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్ నెంబర్ల తనకు నేరుగా మెసేజ్ చేయాలని కూడా ఆమె కోరారు.
చిన్మయి ఏమని ట్వీట్ చేశారంటే.. మేడమ్, వైరముత్తు తనపై చేసిన లైంగిక వేధింపులకు సంబంధించిన వ్యవహారంపై మీకు నాలుగు నెలల కిందటే తెలియజేశాను. కాని ఇంత వరకు ఎలాంటి స్పందన లేదు. నేనే కాక ఎంతో మంది వైరముత్తు బారిన పడ్డారు. కాని బయటపడితే వారి జీవనాధారం కోల్పోవలసి వస్తోందని ఆగిపోయారు. నాకు కూడా నాలుగు నెలల నుంచి పని లేక ఇబ్బందులు పడుతున్నాను. కనీసం నేను కేసు పెట్టలేని స్థితిలో ఉన్నాను. దయచేసి నాకు ఒక పరిష్కారం చూపండి అని ట్వీట్ చేసింది. దీనిపై మేనక గంట లోపే స్పందించారు.
I have taken up your case with @NCWIndia. Kindly DM your contact details. @Chinmayi @sharmarekha https://t.co/louSvb4Ge6
— Maneka Gandhi (@Manekagandhibjp) February 27, 2019